PACE హాస్పిటల్స్ తెలంగాణలోని హైదరాబాద్ నందు ఉన్న కీమోథెరపీ హాస్పిటల్స్లో ఉత్తమమైన హాస్పిటల్. ఇది క్యాన్సర్ చికిత్సలకు నిష్ణాతులు మరియు అనుభవజ్ఞులైన ఆంకాలజిస్టుల బృందాన్ని కలిగి ఉంది. ఆసుపత్రిలో రోగులకు సౌకర్యవంతమైన మరియు సహాయక వాతావరణాన్ని అందించే అత్యాధునిక కీమోథెరపీ సదుపాయం కూడా PACE హాస్పిటల్స్ నందు ఉంది.
మా ఆంకాలజీ విభాగం నోటి ద్వారా, అదేవిధంగా ఇంజెక్షన్ మరియు ఇంట్రాథీకల్ కీమోథెరపీతో సహా పలు రకాల కీమోథెరపీ ఎంపికలను అందిస్తుంది. వీటితోపాటుగా వికారం, వాంతుల నివారణ, జుట్టు నష్టాన్ని తగ్గించడం మరియు నొప్పికి చికిత్స వంటి సహాయక సంరక్షణ సేవలను కూడా అందిస్తుంది.
కీమోథెరపీ చికిత్స కోసం అపాయింట్‌మెంట్‌ని అభ్యర్థించగలరు
Thank you for contacting us. We will get back to you as soon as possible. Kindly save these contact details in your contacts to receive calls and messages:-
Appointment Desk: 04048486868
Whatsapp: 8977889778
Regards,
Pace Hospitals
Hitech City and Madinaguda
Hyderabad, Telangana, India.
Thank you for contacting us. We will get back to you as soon as possible. Kindly save these contact details in your contacts to receive calls and messages:-
Appointment Desk: 04048486868
Whatsapp: 8977889778
Regards,
Pace Hospitals
Hitech City and Madinaguda
Hyderabad, Telangana, India.
Chemotherapy in telugu
కీమోథెరపీ అనేది క్యాన్సర్కు చికిత్స, ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను ఉపయోగిస్తుంది. ఇది దైహిక చికిత్స, అంటే మందులు రక్తప్రవాహం ద్వారా శరీరం అంతటా ప్రయాణించి క్యాన్సర్ కణాలను చేరుకుంటాయి.
కీమోథెరపీని అనేక రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు, అండాశయాలు, క్లోమం, కడుపు మరియు ల్యుకేమియా క్యాన్సర్‌లకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఒంటరిగా లేదా రేడియేషన్ థెరపీ లేదా శస్త్రచికిత్స వంటి ఇతర చికిత్సలతో కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు అనేవి ఔషధ రకం మరియు ఉపయోగించిన మందు మోతాదుపై ఆధారపడి మారుతూ ఉంటాయి.
Chemotherapy meaning in telugu
కీమోథెరపీ మందులతో క్యాన్సర్కు చికిత్స చేయడం అనేది కీమోథెరపీ యొక్క ప్రాథమిక నిర్వచనం. ప్రామాణికంగా లేదా లక్ష్యంగా చేసుకుని ఇయ్యబడే కీమోథెరపీల యొక్క అంతిమ లక్ష్యం క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటి మీద దాడి చేసి, మెటాస్టాసిస్ (వ్యాప్తి చెందడం) జరగనివ్వకుండా చేయడం. తద్వారా, మనిషి మరణాన్ని నియంత్రించడం జరుగుతుంది.
పాల్ ఎర్లిచ్, అనే ఒక జర్మన్ రసాయన శాస్త్రవేత్త, మొట్టమొదటిసారి "కీమోథెరపీ" అనే పదాన్ని ఉపయోగించారు. గ్రీకు భాషలో దీని అర్థం "రసాయనాల ద్వారా వ్యాధులకు చికిత్స" (కీమో-, "కెమికల్," మరియు థెరపియా-, "హీలింగ్). అతను అనేక అంటు రుగ్మతలకు చికిత్స చేయడానికి వివిధ రసాయనాలను మందులుగా వినియోగించి పరిశోధించాడు. జంతు నమూనాల వినియోగాన్ని కూడా పరిశీలించిన మొదటి శాస్త్రవేత్త ఇతనే. అతని రచనలు మరియు పతిశోధనల కారణంగా, అతన్ని "కెమోథెరపీకి" పితామహుడిగా అభివర్ణిస్తారు.
వివిధ క్యాన్సర్ కారకాలు మరియు క్యాన్సర్ను-ప్రేరేపించే కారకాలు ఉన్నప్పటికీ, క్యాన్సర్ను మాత్రం ప్రభావితం చేసేది జన్యువులే. కార్సినోజెనిసిస్ (క్యాన్సర్ జననం) అనేది కణ ఉత్పత్తి మరియు కణాల నిరోధక అసమతుల్యతల కారణంగా సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెంది క్యాన్సర్కు దారితీస్తుంది.
కార్సినోజెనిసిస్‌లో, అపోప్టోసిస్ (ప్రోగ్రామ్డ్ సెల్ డెత్-కణాల సహజ మరణం) మరియు సెనెసెన్స్ (కణాల సహజ వృద్ధాప్యం) వంటి సాధారణ ప్రక్రియలు సరిగా జరగవు అదేవిధంగా అధిక కణ విభజన నియంత్రించబడదు. టీలోమరేస్ అనే ఒక ఎంజైమ్ కణాలను అత్యధికంగా విస్తరించేలా చేస్తుంది. ఈ టీలోమరేస్ చర్య సాధారణ మానవ కణాలలో అణచివేయబడినప్పటికీ, క్యాన్సర్ కణాలలో, ఇది తిరిగి క్రియాశీలం చేయబడుతుంది.
క్యాన్సర్ కణాలలో టీలోమరేస్ చర్యను నిరోధించే వ్యూహాలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న దశలలో ఒకటిగా ఉంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను సులభతరం చేసే కీలక జన్యువులు, ప్రోటీన్లు మరియు గ్రాహకాలను లక్ష్యంగా చేసుకుని అరికట్టే చికిత్సల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Routes of chemotherapy administration in telugu
క్యాన్సర్ దశ మరియు రకాన్ని బట్టి, కీమోథెరపీని ఇచ్చే మార్గాలు మారుతూ ఉంటాయి. వివిధ మార్గాలు ఏమనగా:
రోగి యొక్క పరిస్థితిని ఆధారం చేసుకుని, కీమోథెరపీని ఒంటరిగా (మొనోథెరపీ) లేదా శస్త్రచికిత్సతో కలిపి ఇవ్వాలో నిర్ణయించబడుతుంది. రేడియేషన్ థెరపీ లేదా బయోలాజికల్ థెరపీ వంటి ఇతర చికిత్సలతో (కాంబినేషన్ థెరపీ) అందించడానికి రోగి యొక్క పరిస్థితిని బట్టి ఆరోగ్య సంరక్షణ బృందం నిర్ణయిస్తుంది.
Chemotherapy procedure types in telugu
సాధారణంగా, కీమోథెరపీ యొక్క సూత్రాలు క్యాన్సర్ పెరుగుదలను నిరోధించడం కోసం సూచించబడ్డాయి. అయినప్పటికీ, క్యాన్సర్ రకాన్ని, మెటాస్టాసిస్ (వ్యాప్తి), మరియు ఇతర కారకాలను బట్టి, కీమోథెరపీ యొక్క లక్ష్యాలు మారుతూ ఉంటాయి.
కీమోథెరపీని ఇతర కీమోథెరప్యూటిక్ ఏజెంట్లు లేదా ఇతర రకాల క్యాన్సర్ థెరపీలతో కలిపి ఇవ్వగలిగే మిశ్రమ కీమోథెరపీ విధానాన్ని ఉపయోగించడం సర్వసాధారణం. అయినప్పటికీ, ఆంకాలజిస్టులు (కాన్సర్ వ్యాధి నిపుణులు) తరచుగా దుష్ప్రభావాలను తగ్గించడానికి ఒకే రకమైన కీమోథెరపీ మందును సూచిస్తారు.
కీమోథెరపీ విధానం: కీమోథెరపీ ప్రక్రియను రోగికి వివిధ పద్ధతుల ద్వారా ఇవ్వవచ్చు. ఈ పద్ధతులు విలక్షణమైనవి. వివిధ పద్ధతులు ఏమనగా:
Chemotherapy treatment in telugu
ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆంకాలజీ రంగం క్యాన్సర్ కారకాన్ని (క్యాన్సర్ పెరుగుదలను) అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. కొత్త సమాచారం అనేది కొన్ని కీమోథెరపీ మందులు మరియు ఔషధాల గురించి తెలుసుకొని వాటిని కనుకొనడంలో సహాయపడుతుంది. ఈ మందులు వివిధ దశల వద్ద కార్సినోజెనిసిస్‌ను ఆపగలవు.
కీమోథెరపీ ఔషధాల వర్గీకరణ: కీమోథెరపీ ఔషధాలు వాటి క్రియల ఆధారంగా వర్గీకరించబడ్డాయి. వివిధ రకాల కీమోథెరపీ మందులు ఏమనగా:
ఆల్కైలేటింగ్ ఏజెంట్లు: సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆల్కైలేటింగ్ ఏజెంట్లు డియోక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ (DNA)తో వ్యవహరిస్తాయని చెప్పవచ్చు, తద్వారా క్యాన్సర్ కణాల విభజనను మరియు ప్రతిరూపణను నివారిస్తుంది. దీని గురించి మరింత అర్థం చేసుకోవాలంటే, ముందుగా DNA ని అర్థం చేసుకోవాలి. కణాలతో ఉండే దాదాపు అన్ని జీవులలో DNA అనేది వంశపారంపర్యంగా వచ్చే పదార్థం. జీవి పునరుత్పత్తి సమయంలో, తల్లిదండ్రుల DNAలో కొంత భాగం సంతానానికి పంపబడుతుంది. ఇది డబుల్ హెలిక్స్ నిర్మాణంలో ఉంటుంది, అదేవిధంగా DNA యొక్క ప్రతి స్ట్రాండ్ కూడా కణ విభజన సమయంలో డూప్లికేషన్ కోసం ఒక నమూనాగా ఉపయోగపడుతుంది.
ఆల్కైలేటింగ్ ఏజెంట్లు క్యాన్సర్ కణాల DNAని 2 విధాలుగా దెబ్బతీస్తాయి. ఎలాగనగా:
క్యాన్సర్ కీమోథెరపీలో ఉపయోగించే ఆరు రకాల ఆల్కైలేటింగ్ ఏజెంట్లు ఏమనగా:
ప్లాటినం అనలాగ్‌లు: ఈ ప్లాటినం ఆధారిత కీమోథెరపీ మందులు విస్తృత యాంటినియోప్లాస్టిక్ (యాంటిక్యాన్సర్) చర్యను ప్రదర్శిస్తాయి, ముఖ్యంగా అండాశయాలు, తల, మెడ, మూత్రాశయం, అన్నవాహిక, ఊపిరితిత్తులు మరియు పెద్దప్రేగు క్యాన్సర్‌లలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఆల్కైలేటింగ్ ఏజెంట్ల మాదిరిగానే, ఈ మందులు కూడా క్యాన్సర్ కణాల DNAతో బంధం ఏర్పరచుకుని పని చేస్తాయి; తేడా ఏమిటంటే ఈ ప్లాటినం అనలాగ్‌లు DNAతో సమయోజనీయ బంధాన్ని ఏర్పరచుకుంటాయి.
యాంటీమెటాబోలైట్స్: క్యాన్సర్ కీమోథెరపీలోని ఈ యాంటీమెటాబోలైట్‌లు జీవక్రియలుగా మారి DNA మరియు RNA సంశ్లేషణకు ఆటంకం కలిగిస్తాయి.
మరింత అర్థం చేసుకోవడానికి, DNA మరియు RNA సంశ్లేషణకు అవసరమైన సమ్మేళనాలను అధ్యయనం చేయాలి. పిరిమిడిన్లు మరియు ప్యూరిన్లు అనేవి RNA, DNA ల యొక్క బిల్డింగ్ బ్లాక్స్. ఫోలిక్ యాసిడ్ అనేది సెల్ రెప్లికేషన్‌లో సహాయపడే ముఖ్యమైన విటమిన్. యాంటీమెటాబోలైట్‌లు పైన ఉదహరించిన సమ్మేళనాలను పోలి ఉంటాయి కాబట్టి, క్యాన్సర్ కణాలు తరచుగా అసలైన సమ్మేళనాల బదులు ఈ యాంటీమెటాబోలైట్‌లను తీసుకుంటాయి, తద్వారా
కార్సినోజెనిసిస్‌కు అంతరాయం కలిగిస్తుంది. క్యాన్సర్ కీమోథెరపీ చికిత్సలో ఉపయోగించే యాంటీమెటాబోలైట్లు ఏమనగా:
మైక్రోటుబ్యూల్-డ్యామేజింగ్ ఏజెంట్లు: మైక్రోటూబ్యూల్ కీమోథెరపీ అనేది మైక్రోటూబ్యూల్స్‌తో బంధాన్ని ఏర్పరచుకుని వాటి పనితీరును మరియు లక్షణాలను ప్రభావితం చేసే విభిన్న ఔషధాల సమూహాన్ని కలిగి ఉంటుంది.
మైక్రోటూబ్యూల్స్ అనేవి సెల్ లోపల ఉండే చిన్న ట్యూబ్ లాంటి నిర్మాణాలు, అవి సెల్ యొక్క ఆకృతి మరియు చలనశీలతను నిర్వహిస్తాయి. అదేవిధంగా, సెల్యులార్ ప్రోటీన్ల కణాంతర రవాణాను సులభతరం చేస్తాయి. ఈ కీమోథెరపీ ఔషదాలు మైక్రోటూబ్యూల్ ఏర్పడటాన్ని నిరోధించి తద్వారా కణాల మరణానికి దారితీస్తాయి. మైక్రోటూబ్యూల్ కీమోథెరపీ యొక్క తొమ్మిది రకాలు ఏమనగా:
టోపోఐసోమరేస్ ఇన్హిబిటర్స్: ఈ మందులు టోపోఐసోమరేస్ I మరియు II యొక్క చర్యను నిరోధిస్తాయి, తద్వారా సెల్యులార్ పెరుగుదలను నిరోధిస్తుంది. టోపోయిసోమరేస్ I మరియు టోపోయిసోమరేస్ II అనేవి క్షీరద కణాల (మమ్మేలియన్) కేంద్రకంలో కనిపించే ఎంజైమ్‌లు. టోపోయిసోమరేస్ ఇన్హిబిటర్లు రెండు రకాలుగా ఉన్నాయి:
కీమోథెరపీ-యాంటీబయాటిక్ మందులు: బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి కొన్ని "యాంటీబయాటిక్స్" ఉపయోగించబడుతున్నప్పటికీ, కార్సినోజెనిసిస్‌ను పరిమితం చేసే యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. అవి వివిధ
పద్ధతుల ద్వారా క్యాన్సర్ కారకాన్ని నిరోధిస్తాయి, అవి ఏమనగా:
స్టెరాయిడల్ కీమోథెరపీ: స్టెరాయిడ్లు అనేవి సహజంగా శరీరంలో ఉత్పత్తి చేయబడతాయి. ఇవి వివిధ విధులను నియంత్రించడం మరియు నిర్వహించడంలో సహాయపడతాయి. వీటిని సింథటిక్‌గా కూడా తయారు చేయవచ్చు. కార్టిసోన్ ద్వారా కణితిని నయం చేయడాన్ని ఆవిష్కరించడంతో, కీమోథెరపీ చికిత్సలో స్టెరాయిడ్లను చేర్చడం ప్రారంభమైంది. ఇవి DNA, RNA మరియు ప్రోటీన్ సంశ్లేషణలను తగ్గించడం ద్వారా సైటోటాక్సిసిటీని సాధిస్తాయి.
తదుపరి పరిశోధన తర్వాత, స్టెరాయిడ్లు అనేవి క్యాన్సర్తో ఈ క్రింది విధాలుగా అనుబంధం కలిగి ఉన్నాయి:
Radiotherapy vs Chemotherapy in telugu
కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీని, రేడియోధార్మికత మరియు సైటోటాక్సిక్ కీమోథెరపీ ఔషధాల ద్వారా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. వాటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి, అవి ఏమనగా:
అంశం | రేడియోథెరపీ | కీమోథెరపీ |
---|---|---|
సూత్రం | దీనిలో క్యాన్సర్ కణాలు మరియు కణజాలాలను లక్ష్యంగా చేసుకుని ఎక్స్-కిరణాలు లేదా సబ్‌అటామిక్ కణాలు వంటి అధిక శక్తి తరంగాలను పంపటం జరుగుతుంది. | కీమోథెరపీ ఔషధాలు అనేవి DNA ప్రొటీన్ల సంశ్లేషణకు ఆటంకం కలిగించి, DNAతో నేరుగా బంధిం ఏర్పరచుకుని కణితి కణాలను నిరోధించి, చంపడం జరుగుతుంది. |
ఇతర కణజాలాలపై ప్రభావం | కిరణాలు ఖచ్చితమైనవి కానందున, ఇది సమీపంలోని ఆరోగ్యకరమైన కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. | కీమోథెరపీ మందులు కొన్ని సందర్భాలలో సాధారణ కణజాలను కూడా చంపుతాయి. |
రకాలు | మూడు రకాలు: బాహ్య రేడియేషన్, అంతర్గత రేడియేషన్ మరియు దైహిక రేడియేషన్ | వివిధ రకాలైన కీమోథెరపీ వర్గీకరణ ప్రధానంగా దాని యొక్క మెకానిజంపై (పనితీరు) ఆధారపడి ఉంటుంది. |
ఇచ్చే మార్గాలు | బాహ్య మూలం (బాహ్య బీమ్ రేడియోథెరపీ), అంతర్గత మూలం (బ్రాకీథెరపీ), ఇంట్రావీనస్ (సిరలోకి ) | క్యాన్సర్ దశ మరియు రకాన్ని బట్టి, కీమోథెరపీని ఇచ్చే మార్గాలు మారుతూ ఉంటాయి. వివిధ మార్గాలు ఏమనగా - ఓరల్ కీమోథెరపీ (నోటి ద్వారా) లేదా, కీమోథెరపీ ఇంజెక్షన్, టాపికల్ (చర్మంపై ఇవ్వబడుతుంది). |
పైన ఉదహరించిన తేడాలు ఉన్నప్పటికీ, ఆంకాలజిస్ట్ కొన్నిసార్లు చికిత్స చేయడానికి కలయిక చికిత్సను సూచించడం జరుగుతుంది. ఈ కాంబినేషన్ థెరపీలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, టార్గెటెడ్ మరియు రేడియేషన్ థెరపీ ఉంటాయి. కాబట్టి, వివిధ మెకానిజమ్‌ల (పనితీరు) ద్వారా, క్యాన్సర్ పెరుగుదల అరికట్టడమే కాకుండా, వచ్చే అవకాశాలను కూడా కట్టడి చేయవచ్చు.
చారిత్రాత్మకంగా, కీమోథెరపీ మూలం దాని ఆవిష్కరణ చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా రహస్యంగా ఉంచబడి ఉంది.
క్యాన్సర్‌కు సంబంధించిన కీమోథెరపీ మూలం కేవలం ఇంటెన్సివ్ మరియు కఠినమైన పరిశోధనల ఫలితాలపై మాత్రమే కాకుండా మొదటి ప్రపంచ యుద్ధం (WWI) సమయంలో సంభవించిన కొన్ని ప్రమాదవశాత్తు కారణాల వల్ల కనుగొనటం జరిగింది. అప్పటి వరకు కెమికల్ వార్ఫేర్లో ఆయుధంగా ఉపయోగించిన మస్టర్డ్ గ్యాస్, ఆ తరువాత క్రమేపి కీమోథెరపీ ఆవిష్కృతానికి ఒక దిక్సూచిగా నిలిచింది.
మస్టర్డ్ గ్యాస్ బాధితుల శవపరీక్షల్లో తీవ్ర మెడుల్లార్ డ్యామేజ్ మరియు ప్రస్ఫుటమైన ల్యూకోపెనియాను (తక్కువ తెల్ల రక్త కణాల సంఖ్య) సూచించడం జరిగింది. ఈ ల్యుకోపెనియా పరిస్థితి పరిశోధనలు జరిపే ఆంకాలజిస్టుల దృష్టిని ఆకర్షించింది, ఎందుకంటే ల్యూకోసైట్లు (తెల్ల రక్త కణాలు) అనేవి ఒత్తిడి మరియు ఇన్ఫెక్షన్ల సందర్భాలలో వేగంగా వృద్ధి చెందుతాయి. వీటి సంఖ్యను తగ్గించగల ఏదైనా మందులు క్యాన్సర్‌పై కూడా తమ ప్రభావాన్ని చూపుతాయి. క్యాన్సర్ అనేది అనియంత్రిత సైటోజెనిసిస్ (కణ జననం) యొక్క పరిస్థితి.
ఈ పరిణామం మొదటి క్లినికల్ ట్రయల్‌కు దారితీసింది, దీనిలో నైట్రోజన్ - మస్టర్డ్ గ్యాస్ యొక్క ఉత్పన్నాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ పరిశోధన లింఫోసార్కోమా (శోషరస వ్యవస్థ యొక్క క్యాన్సర్) ను ఎదుర్కోవడానికి 10 తక్కువ మోతాదులతో (0.1-1.0 mg/kg) నైట్రోజన్ - మస్టర్డ్ను కలిగి ఉన్న ఇంట్రావీనస్ పంపిణీని ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఫలితం ఏమనగా కణితిని విజయవంతంగా తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషించింది. అయితే, దీని ప్రభావాలు తాత్కాలికమైనవని గుర్తించబడింది మరియు చివరికి కణితులను పూర్తిగా తొలగించడానికి శస్త్రచికిత్స అవసరతను ధ్రువపరిచింది.
ఈ ఇంట్రావీనస్ కీమోథెరపీ అనేది కణితిని తగ్గిస్తుందనే భావనకు రుజువును అందించినందున పరిశోధకులకు ఒక బలమైన నమ్మిక ఏర్పడింది. తద్వారా, ఈ కీమోథెరపీ అనేది క్యాన్సర్ను అరికట్టే మందులు మరియు ప్రధాన శస్త్రచికిత్సలకు బదులుగా ఉపయోగించవచ్చునని తెలిసివచ్చింది.
ఇది ఆధునిక క్యాన్సర్ కీమోథెరపీ చికిత్సా యుగంగా ప్రతిధ్వనించింది. అదేవిధంగా, అప్పటి నుండి, అనేక యాంటీనియోప్లాస్టిక్ (క్యాన్సర్ను తగ్గించే) మందులు అభివృద్ధి చేయబడ్డాయి. తద్వారా, వివిధ రకాలైన క్యాన్సర్‌లకు ఈ కీమోథెరపీ నియమావళిని కనుగొనటం జరిగింది.
Chemotherapy uses in telugu
రొమ్ము క్యాన్సర్‌కు కీమోథెరపీ
స్థానికంగా అభివృద్ధి చెందిన రొమ్ము క్యాన్సర్ మరియు ప్రారంభ-దశ రొమ్ము క్యాన్సర్‌లో, రొమ్ము-సంరక్షణ శస్త్రచికిత్సకు సహాయపడటానికి నియోఅడ్జువాంట్ కీమోథెరపీ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సింగిల్-ఏజెంట్ కీమోథెరపీతో పోల్చినప్పుడు పాలీకీమోథెరపీ (కలయిక గల కీమోథెరపీ) అధిక ప్రతిస్పందన రేటును కలిగి ఉంది, ఎందుకంటే ఇది సమర్థవంతమైన నిర్వహణ, విషపూరితాన్ని తగ్గించడం మరియు ఔషధ నిరోధకత లక్షణాలను కలిగి ఉంది. మొదటి రొమ్ము క్యాన్సర్ కీమోథెరపీ దశలో వికారం, వాంతులు, అలసటతో కూడిన కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్కు కీమోథెరపీ
ప్రస్తుతానికి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు 1వ మరియు 2వ నిరోధ దశల నిర్వహణలో కీమోథెరపీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి చిన్న కణాల ఊపిరితిత్తుల క్యాన్సర్ (మెటాస్టాసిస్) దశలో బాగా ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ ఫ్రంట్‌లైన్ కీమోథెరపీతో చికిత్స పొందిన ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు మధ్యస్థ మనుగడ కేవలం పది నెలలు మాత్రమే. అయితే, చాలా మంది రోగులలో మళ్ళీ వ్యాధి తిరిగి పునరావృతం అవుతుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్కు కీమోథెరపీ
ప్రోస్టేట్ క్యాన్సర్ కీమోథెరపీ అనేది ప్రారంభం నుండి నాటకీయ మార్పులకు గురైంది. మునుపటి పరిశోధనల్లో వివిధ రకాల కీమోథెరపీ నియమావళిని ఉపశమనకారకంగా ఉపయోగించినప్పటికీ, ఇది టాక్సేన్ ఔషధాల వాడుకతో మారిపోయింది. 2015 అధ్యయనం ప్రకరాం రేడియేషన్ థెరపీ తర్వాత ఇచ్చిన అడ్జువెంట్ కీమోథెరపీతో క్యాన్సర్ చికిత్సకు ఆశాజనక ఫలితాలు వచ్చాయి.
అండాశయ క్యాన్సర్కు కీమోథెరపీ
దశాబ్దాల క్లినికల్ ట్రయల్స్ ఫలితంగా అండాశయ క్యాన్సర్ యొక్క పురోగతిని ఎదుర్కోవడానికి ఇంట్రావీనస్ మార్గం ద్వారా ప్లాటినం/టాక్సేన్లను ఇవ్వడంలో పరిపూర్ణత వచ్చింది. అయినప్పటికీ, ఇంట్రాపెరిటోనియల్ మార్గం ద్వారా కీమోథెరపీని ప్రవేశపెట్టే వరకు దీని యొక్క ఆవిష్కరణ స్థంభించింది. వీటితోపాటుగా యాంజియోజెనిసిస్ ఇన్హిబిటర్స్ వంటి టార్గెటెడ్ ఏజెంట్లు కూడా కొత్త విధానాలలో ఉన్నాయి.
పెద్దప్రేగు క్యాన్సర్‌కు కీమోథెరపీ
కాంబినేషన్ కీమోథెరపీ (ముఖ్యంగా శస్త్రచికిత్సతో కలిపి) మెటాస్టాటిక్ కొలొరెక్టల్ క్యాన్సర్కు చికిత్స ఇవ్వడం అనేది ఒక కీలకమైన ఉద్దేశం, ఇది జీవన మనుగడను మెరుగుపరుస్తుంది. కనుగొనబడిన దగ్గరనుంచి ఇప్పటి వరకు, కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నవారిలో 12-నెలల మనుగడను విజయవంతంగా మెరుగుపరచడానికి యాంటీమెటాబోలైట్‌లు మాత్రమే కీమోథెరపీగా ఇవ్వడం జరిగింది. మెటాస్టాటిక్ కొలొరెక్టల్ క్యాన్సర్‌కు కీమోథెరపీ అనేది చాలా సంవత్సరాలుగా చికిత్సలో భాగమై ఉంది, ఇది రోగి యొక్క జీవిత కాల వ్యవధి మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు కీమోథెరపీ
ప్యాంక్రియాటిక్ డక్టల్ అడినోకార్సినోమాను నయం చేయడానికి అడ్జువెంట్ కీమోథెరపీతో కూడిన శస్త్రచికిత్సకు మాత్రమే అవకాశం ఉంది, అయితే చాలా మంది రోగులు కోలుకోలేని వ్యాధితో బాధపడుతూ, పాలియేటివ్ కెమోథెరపీని ఆధారం చేసుకుని ఉన్నారు. పెద్ద శస్త్రచికిత్సలు మరియు సహాయక కీమోథెరపీలు ఉన్నప్పటికీ, చాలా మంది రోగులు శస్త్రచికిత్స తర్వాత మళ్ళీ కాన్సర్ వ్యాధికి గురవుతారు. చివరకు పాలియేటివ్ కీమోథెరపీతో చికిత్స పొందుతారు.
ఉదర లేదా కడుపు క్యాన్సర్కు కీమోథెరపీ
సాధారణంగా, ఫేజ్ II ట్రయల్స్‌లో 60% మంది రోగులకు కీమోథెరపీ ప్రతిస్పందనలు ఉండవచ్చు, అయితే వారిలో ఎక్కువ మంది కొన్ని నెలల్లోనే ఔషధ నిరోధకతకు గురయ్యారు. మధ్యస్థ మనుగడ సాధారణంగా 7-9 నెలల వరకు ఉంటుంది. కీమోథెరపీ ఫలితాలు విషపూరిత ప్రభావాలతో సంక్లిష్టంగా ఉన్నందున, ఉత్తమ సహాయక సంరక్షణతో పోల్చినప్పుడు మనుగడ లేదా జీవన నాణ్యత పరంగా దాని ప్రయోజనాన్ని అంచనా వేసిన తర్వాత మాత్రమే కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది.
కీమోథెరపీకి ముందు మరియు తరువాత చేసే పనులు మరియు సూచనలు/జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు మరియు వాటిని ఎలా అరికట్టాలో తెలుసుకోవడానికి ఆంకాలజిస్ట్‌తో మాట్లాడటం చాలా అవసరం. కీమోథెరపీ చికిత్స అనేది ఒక కష్టతరమైన అనుభవం కావచ్చు, కానీ మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోవడం ముఖ్యం. కీమోథెరపీ చేయించుకుని బతికిన వారు చాలా మంది ఉన్నారు. సరైన మద్దతుతో, మీరు దీన్ని (క్యాన్సర్ని) అధిగమించవచ్చు.
Benefits of chemotherapy in telugu
మొత్తం కీమోథెరపీ ప్రయోజనాలలో ప్రధానంగా క్యాన్సర్‌ను అరెస్టు చేయడం మరియు వీలైతే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం వంటివి ఉన్నాయి, కీమోథెరపీ యొక్క ప్రయోజనాలు అనేవి సూచించబడిన క్యాన్సర్ రకం వంటి అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటాయి.
తీవ్రమైన నాన్-స్మాల్-సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులలో జీవన నాణ్యతను అభివృద్ధి చేయడంలో కీమోథెరపీ పాత్రను గురించి 2002 కథనంలో ప్రచురితమైంది.
తీవ్రమైన నాన్-స్మాల్-సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో కీమోథెరపీ యొక్క ప్రయోజనాలు చాలా చర్చనీయాంశమయ్యాయి. అదేవిధంగా, ఐదు మెటా-విశ్లేషణల ప్రచురణ తర్వాత, ఫలితాలు ఏమి చెప్పాయంటే కీమోథెరపీ ప్రధానంగా సిస్ప్లాటిన్-ఆధారిత కీమోథెరపీ నియమావళి అనేది, మనుగడపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని ప్రదర్శించాయని నిర్ధారించాయి.
కీమోథెరపీని ఇవ్వడంతో జీవన నాణ్యతలో మెరుగుదలని గుర్తించిన వివిధ పరిశోధనలు ఉన్నాయి. నాన్-స్మాల్-సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో కీమోథెరపీ యొక్క ప్రయోజనాలు మరియు మెరుగుదలలు ఈ విధంగా కలిగి ఉన్నాయి:
Chemotherapy side effects in telugu
కీమోథెరపీ సమయంలో, అనియంత్రిత కణ విభజన (కార్సినోజెనిసిస్) పరిమితం చేయబడుతుంది మరియు కాలక్రమేణా, అవి క్యాన్సర్ కణాల నాశనాన్ని సాధిస్తాయి. క్యాన్సర్ కణాలతో పాటు, శరీరంలోని ఇతర కణజాలాలు కూడా కీమోథెరపీ ఔషధాలకు వివిధ స్థాయిలలో సున్నితత్వాన్ని ప్రదర్శిస్తాయి. పర్యవసానంగా, యాంటిట్యూమర్ ప్రభావం తరచుగా దుష్ప్రభావాలతో సహా వివిధ స్థాయిలలో ప్రతికూల చర్యలతో కూడి ఉంటుంది. కీమోథెరపీ వర్గీకరణ కూడా కీమోథెరపీ దుష్ప్రభావాలను ప్రదర్శించడంలో పాత్ర పోషిస్తుంది. కీమోథెరపీ యొక్క ప్రధాన దుష్ప్రభావాలు ఏవనగా:
కీమోథెరపీ తర్వాత వచ్చే ఎముక మజ్జ అణిచివేత
కీమోథెరపీ ప్రక్రియ వల్ల సాధారణంగా వచ్చే దుష్ప్రభావాలలో ఎముక మజ్జ అణిచివేత ఒకటి. ఎముక మజ్జ అణిచివేత అనేది రక్త పరీక్షలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు మరియు ఎర్ర రక్త కణాలను సూచిస్తుంది.
జీర్ణాశయాంతర ప్రతికూల చర్యలు
జీర్ణాశయాంతర శ్లేష్మ కణాలు మరియు ఎముక మజ్జ కణాలు రెండూ అధిక వృద్ధి పనితీరుతో విస్తరించే కణాలు. అందువల్ల, జీర్ణాశయాంతర శ్లేష్మ కణాలు కీమోథెరపీ ఔషధాలకు సున్నితత్వాన్ని చూపుతాయి అదేవిధంగా మందులు తీసుకున్న కొన్ని గంటలలో విషపూరిత ప్రతిచర్యలను చూపిస్తాయి. జీర్ణాశయాంతర ప్రతిచర్యలు సాధారణంగా ఎముక మజ్జ అణిచివేత కంటే ముందుగానే కనిపిస్తాయి. జీర్ణాశయాంతర ప్రతికూల చర్యలు ఏమనగా ఆకలిని కోల్పోవడం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం మరియు రక్త విరేచనాలు మొదలైనవి.
కీమోథెరపీ ప్రేరిత న్యూరోటాక్సిసిటీ
న్యూరోటాక్సిసిటీ అనేది కీమోథెరపీకి వాడే ఔషధాల జీవక్రియ వల్ల వచ్చే విష ప్రభావం నుండి వస్తుంది.
న్యూరోటాక్సిసిటీ అనేది కాలి తిమ్మిరి, స్నాయువు ప్రతిచర్యలు కోల్పోవడం, పేరస్తీషియా (గుచ్చిన లేదా మండిన అనుభూతి) మరియు కొన్నిసార్లు మలబద్ధకం లేదా ప్రేగులకు పక్షవాతం కలిగిస్తుంది. కొన్ని మందులు కేంద్ర నాడీ వ్యవస్థని విషపూరితం చేస్తాయి, తద్వారా ప్రధానంగా పేరస్తీషియా (గుచ్చిన లేదా మండిన అనుభూతి), తిమ్మిరి, జలదరింపు, నడక రుగ్మతలు మరియు అటాక్సియా (కండరాల మీద నియంత్రణ కోల్పోవడం) వంటివి వ్యక్తమవుతాయి.
నాడీ వ్యవస్థకు నష్టం అనేది ప్రధానంగా విన్కా ఆల్కలాయిడ్స్ మరియు ఆల్కైలేటింగ్ ఏజెంట్ల వల్ల వస్తుంది. ఇవి గందరగోళాన్ని, దిక్కుతోచని స్థితి, తలనొప్పి, శ్రవణ భ్రాంతులు, మగత, వణుకు, పక్షవాతం, మూర్ఛ, వెర్టిగో మొదలైనవాటికి దారితీస్తాయి.
కీమోథెరపీ ప్రేరిత హెపాటోటాక్సిసిటీ
హెపాటోటాక్సిసిటీ అంటే కాలేయం దెబ్బతినడం, వివిధ రకాల కీమోథెరపీలు ఈ హెపాటోటాక్సిసిటీకి దారితీస్తాయి. చాలా సందర్భాల్లో ఇది నిర్దిష్ట ప్రతిచర్యల కారణంగా వస్తుంది. ఈ స్థితిని సాధారణంగా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత 1-4 వారాలలో లోపు గమనించవచ్చు.
హెపాటోటాక్సిసిటీ అనేది నెక్రోసిస్ (కణజాలము చనిపోవుట) మరియు ఇన్ఫ్లమేషన్‌ను (వాపు) కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక మందుల వాడకం వల్ల ఇది ఫైబ్రోసిస్, కొవ్వు స్థాయిలలో మార్పు, గ్రాన్యులోమా (సూక్ష్మ కణిక గుల్మవ్యాధి) మరియు ఇసినోఫిల్ ఇన్‌ఫిల్ట్రేషన్ వంటి దీర్ఘకాలిక స్థితులకు దారితీస్తుంది. అసాధారణ కాలేయ పనితీరు, కాలేయ ప్రాంతంలో నొప్పి మరియు ఇంట్యూమెసెంట్ (ఉబ్బిన లేదా వాచిన) కాలేయం అనేవి దీనిలో చూడదగిన ప్రముఖ లక్షణాలు.
పైన పేర్కొన్న అంశాల వల్ల కొన్ని దుష్ప్రభావాలు సాధారణంగా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి, అవేవనగా :
ఆరోగ్య సంరక్షణ బృందం రోగికి కీమోథెరపీ గురించి తగినంత విద్యను అందిస్తుంది. మూలాలపై ఆధారపడి, రోగికి విద్యలో సైటోటాక్సిక్ కీమోథెరపీ గురించి అలాగే దాని యొక్క స్వీయ-నిర్వహణ మరియు దాని యొక్క సంబంధిత ప్రతికూల దుష్ప్రభావాలను వివరించడం అనేది జరుగుతుంది. కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడంలో ఈ విద్య రోగికి గొప్పగా సహాయపడుతుంది.
2023 అధ్యయనం ప్రకారం, కీమోథెరపీ గురించి ప్రామాణిక రోగి విద్యను పొందిన క్యాన్సర్ రోగులు, ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవటానికి సాధనాలు, మానసిక కోపింగ్ మరియు మద్దతులో ఈ విద్య వారికి బాగా సహాయపడింది.
Targeted therapy vs Chemotherapy in telugu
టార్గెటెడ్ థెరపీ (లక్ష్య చికిత్స) అనేది ఇటీవల కనుగొనబడిన/నవీనమైన (కీమోథెరపీతో పోల్చినప్పుడు) క్యాన్సర్ చికిత్స. ఇది వివిధ ఔషధాల సమూహాన్ని కలిగి ఉంటుంది. లక్ష్య చికిత్సలు మరియు కీమోథెరపీ మధ్య ప్రధాన తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
అంశం | టార్గెటెడ్ థెరపీ (లక్ష్య చికిత్స) | కీమోథెరపీ |
---|---|---|
సూత్రం | కార్సినోజెనిసిస్‌లో సహాయపడే కారకాలను నాశనం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. | కణ విభజన లేదా DNA సంశ్లేషణతో నేరుగా జోక్యం చేసుకుని కీలక పాత్ర పోషిస్తుంది |
ఇతర కణజాలాలపై ప్రభావం | దీని ద్వారా సాధారణ కణజాలం మరియు కణాలకు తక్కువ హాని ఉంటుంది. | కీమోథెరపీ మందులు కొన్ని సందర్భాలలో సాధారణ కణాలను కూడా చంపుతాయి. |
రకాలు | ఔషధాలను వాటి లక్ష్యాల ఆధారంగా విభజించవచ్చు - వృద్ధి కారకాలు మరియు గ్రాహకాలు, కణాంతర కైనేసులు, ట్యూమర్-హోస్ట్ పరస్పర చర్యలు, క్యాన్సర్ యొక్క రోగనిరోధక గుర్తింపు, ఇతర క్యాన్సర్ ప్రవర్తనలు. | వివిధ రకాలైన కీమోథెరపీ వర్గీకరణ ప్రధానంగా దాని యొక్క మెకానిజంపై (పనితీరు) ఆధారపడి ఉంటుంది. |
Immunotherapy vs Chemotherapy in telugu
ఇమ్యునోథెరపీ మరియు కీమోథెరపీ రెండూ కుడా క్యాన్సర్కు చికిత్సలు, ఇవి సాధారణంగా క్యాన్సర్ పెరుగుదలను ఆపడానికి ఇవ్వబడతాయి. వ్యత్యాసం అనేది వాటి యొక్క చర్యల మీద ఆధారపడి ఉంది. వాటి మధ్య తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
అంశం | ఇమ్యునోథెరపీ | కీమోథెరపీ |
---|---|---|
లక్ష్యం | క్యాన్సర్ కణాలను చంపి, నిర్మూలించగల అత్యంత చురుకైన కణితి-నిర్దిష్ట (ప్రత్యేక) T కణాలను అభివృద్ధి చేస్తుంది. | ఇది కణ విభజన లేదా DNA సంశ్లేషణకు అంతరాయం కలిగించి, తద్వారా క్యాన్సర్ మరియు కార్సినోజెనిసిస్ను ఆపుతుంది. |
ఇతర కణజాలాలపై ప్రభావం | ఈ చికిత్స ఇతర కణజాలాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు, కానీ కొన్ని సందర్భాల్లో, రోగనిరోధక వ్యవస్థ తప్పుగా సాధారణ కణాలను క్యాన్సర్ కణాలుగా అర్ధం చేసుకుని వాటిపై దాడి చేస్తాయి. | కీమోథెరపీ మందులు కొన్ని సందర్భాలలో సాధారణ కణాలను కూడా చంపుతాయి. |
దుష్ప్రభావాలు | దీని ద్వారా వచ్చే కొన్ని రోగనిరోధక-సంబంధిత ప్రతికూల సంఘటనలు (IRAE) ఏమనగా అలసట, దద్దుర్లు, న్యుమోనిటిస్ (ఊపిరితిత్తుల జబ్బు), శ్వాస ఆడకపోవడం, పెద్దప్రేగు శోథ, ఆర్థరైటిస్, హెపటైటిస్ మొదలైనవి. | సులభంగా గాయాలు కావడం, రక్తస్రావం, జుట్టు ఊడటం, అలసట, అంటువ్యాధులు, రక్తహీనత, వాంతులు, వికారం, ఆకలిలో మార్పు, మలబద్ధకం, అతిసారం మొదలైన దుష్ప్రభావాలు కీమోథెరపీ ద్వారా వస్తాయి. |
రకాలు | చెక్‌పాయింట్ ఇన్హిబిటర్లు, చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ T సెల్ థెరపీ, సైటోకైన్స్, ఇమ్యునోమోడ్యులేటర్లు, క్యాన్సర్ టీకాలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ | వివిధ రకాలైన కీమోథెరపీ వర్గీకరణ ప్రధానంగా దాని యొక్క మెకానిజంపై (పనితీరు) ఆధారపడి ఉంటుంది. |
ఇచ్చే మార్గాలు | ఓరల్ కీమోథెరపీ (నోటి ద్వారా), ఇంట్రావీనస్ (సిరలోకి ), టాపికల్ (చర్మంపై ఇవ్వబడుతుంది, ఇంట్రాయురెత్రల్ (మూత్రాశయంలోకి) | క్యాన్సర్ దశ మరియు రకాన్ని బట్టి, కీమోథెరపీని ఇచ్చే మార్గాలు మారుతూ ఉంటాయి. వివిధ మార్గాలు ఏమనగా - ఓరల్ కీమోథెరపీ (నోటి ద్వారా) లేదా, కీమోథెరపీ ఇంజెక్షన్, టాపికల్ (చర్మంపై ఇవ్వబడుతుంది). |
కీమోథెరపీ గురించి తరుచుగా అడుగు ప్రశ్నలు
ఆంకాలజిస్టులు కీమోథెరపీ మరియు దాని సమ్మేళనాల అవసరాన్ని గుర్తించిన తర్వాత దానిని సూచించడం జరుగుతుంది. కీమోథెరపీని వివిధ మార్గాల ద్వారా ఇవ్వటం జరుగుతుంది, అవేవనగా:
ఓరల్ కీమోథెరపీ (నోటి ద్వారా) లేదా
కీమోథెరపీ ఇంజెక్షన్, ఇంజెక్షన్ అనేది:
టాపికల్ (చర్మంపై ఇవ్వబడుతుంది)
కణితి కణాల పురోగతిని నిరోధించడానికి క్యాన్సర్ కణాలపై ప్రాణాంతకమైన సైటోటాక్సిక్ ప్రభావాన్ని కలిగించే రసాయనాలు లేదా మందులను అందించడం ద్వారా కీమోథెరపీ పనిచేస్తుంది.
ఆంకాలజిస్టులు దుష్ప్రభావాల కారణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా రోగులపై కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గిస్తారు మరియు ఆరోగ్య సంరక్షణ బృందం దుష్ప్రభావాలను ఎదుర్కోవటానికి అవసరమైన జాగ్రత్తలను సూచిస్తుంది. రోగులు సాధారణంగా కీమోథెరపీ సమయంలో లేదా తర్వాత సహాయక చికిత్స కోసం మరింత సహాయాన్ని పొందుతారు.
కీమోథెరపీ యొక్క ప్రభావం అనేది క్యాన్సర్ రకం, దశ, క్యాన్సర్ వ్యాప్తి (మెటాస్టాటిక్ లేదా నాన్-మెటాస్టాటిక్), ఇచ్చిన కీమోథెరపీ యొక్క విధానం, ఇచ్చిన కెమోథెరపీ ఏజెంట్ రకం, దుష్ప్రభావాల సంభావ్యత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదా., ప్లాటినం అనలాగ్ ఔషధాల కలయిక 9-10 నెలల మధ్యస్థ మనుగడను ఇస్తుంది. అదే విధంగా, యాంటీమెటాబోలైట్ ఔషధాల కలయిక గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌లో 6 నెలల మధ్యస్థ మనుగడను ఇస్తుంది.
కీమోథెరపీ పరిధి వారానికి ఒకసారి నుండి నెలవారీకి ఒకసారి ఉంటుంది. ఇది కెమోథెరపీ ఔషధం లేదా దాని కలయికపై ఆధారపడి ఉంటుంది, ప్రతి సెషన్ కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది.
సాధారణంగా, చాలా క్యాన్సర్ రకాల్లో దాదాపు అన్ని దశల్లో క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి కీమోథెరపీని ఉపయోగిస్తారు. దశ కంటే, క్యాన్సర్ రకం మరియు చికిత్స యొక్క లక్ష్యాలు కీమోథెరపీ వినియోగాన్ని నిర్ణయిస్తాయి.
అవును. కీమోథెరపీ వేగంగా పునరుత్పత్తి చేసే క్యాన్సర్ కణాలపై దాడి చేయదాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. శరీరం యొక్క సాధారణ నిర్వహణ కోసం వేగంగా విస్తరించే కణజాలపై కూడా దాడి చేస్తుంది. దీని కారణంగా, వివిధ దుష్ప్రభావాలు ఉత్పన్నమవుతాయి, నొప్పి కూడా అందులో ఒకటి.
కీమోథెరపీ చికిత్సలో క్యాన్సర్ కణాలను నివారించే రసాయనాలు లేదా మందులు ఉంటాయి. అవి మొదట్లో ఇన్ఫెక్షన్‌ల కోసం అభివృద్ధి చేయబడినప్పటికీ, తదనంతరం కణితి కణాల పురోగతిని నిరోధించడానికి మరియు ప్రాణాంతక (క్యాన్సర్) కణాలను తగ్గించడానికి అభివృద్ధి చేయబడ్డాయి.
లేదు, కీమోథెరపీని ఇన్ఫెక్షన్‌లకు కూడా ఇవ్వవచ్చు, ఎందుకంటే అవి ఒకే విధమైన చర్య విధానాలపై పనిచేస్తాయి. అయినప్పటికీ, అంటువ్యాధులు మరియు క్యాన్సర్‌లకు చికిత్స చేసే కీమోథెరపీ దాని యొక్క దుష్ప్రభావాలు, విషపూరిత మూలం మొదలైన వాటి నేపథ్యంలో చాలా భిన్నంగా ఉంటుంది.
అవును. కీమోథెరపీ అనేది క్యాన్సర్ చికిత్సకు ప్రామాణిక చికిత్స వలె సురక్షితమైనది. ఇది క్యాన్సర్ను తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ ఇది వివిధ విషపూరిత చర్యలు మరియు దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. రిస్క్-బెనిఫిట్ రేషియోని ఆధారం చేసుకుని, ఆంకాలజిస్టులు క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని ఇస్తారు.
అవును, కీమోథెరపీ ఖచ్చితంగా విలువైనదే. ఇది క్యాన్సర్‌ను అణచివేయడానికి వివిధ రకాల చికిత్సల కలయికగా ఉపయోగించబడుతుంది.
కీమోథెరపీ రోగులకు భద్రతా పరిగణనలు అనేవి క్యాన్సర్ రకం, చికిత్స యొక్క వ్యవధి మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, కీమోథెరపీ దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి.
కీమోథెరపీ చికిత్సా నియమావళిలో డ్రగ్‌ను తగ్గించడం లేదా కొత్త ఔషధాలను జోడించడం వంటివి జరుగుతుంది. చికిత్సలతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలను తగ్గించడానికి తగిన చర్యలను తీసుకున్న తర్వాత మాత్రమే ఆరోగ్య సంరక్షణ బృందం కీమోథెరపీని అందిస్తుంది.
కీమోథెరపీ మందులు విషపూరితమైనవి మరియు వాటిని తగిన జాగ్రత్తలతో ఇవ్వాలి. మందులు వాడుతున్నప్పుడు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలి, అలాగే ఇచ్చిన వెంటనే పారవేయాలి. సబ్బు మరియు నీటితో కడగడం అనేది కొన్ని మందులకు అవసరమని తెలుసుకోవాలి. శరీర ద్రవాలు స్రవించే షీట్లు లేదా మురికిగా ఉన్న బట్టలు వేడి నీరుతో గాని లేదా సాధారణ లాండ్రీ డిటర్జెంట్‌తో మెషిన్‌లో ఉతకవచ్చు. ఆరోగ్య సంరక్షణ బృందం నుండి తీసుకున్న సూచనలు అనేక ఇతర అంశాలలో సహాయపడతాయి.
అవును సురక్షితమే. కీమోథెరపీకి హాజరైనప్పుడు ఇతరులను తాకడం లేదా ముద్దు పెట్టుకోవడం ఖచ్చితంగా సురక్షితమే. అయినప్పటికీ, కీమోథెరపీ ఔషధాలను ఇతరులు తాకనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.
కీమోథెరపీలు శక్తివంతమైన మందులు, ఇవి చర్మంతో సంబంధాన్ని కలిగినప్పుడు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి, మందులను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) వారు ఏమన్నారంటే, చికిత్స చేసిన 48-72 గంటలలోపు, కీమోథెరపీ మందులు శరీరం నుండి వెళ్లిపోతాయని నివేదించారు. అయినప్పటికీ, మూత్రం, వాంతులు మరియు చెమట వంటి శరీర ద్రవాలలో దీని యొక్క ఔషధ వ్యర్థాలు కనిపించవచ్చు. అందువల్ల, నిర్దిష్ట జాగ్రత్తలు వహించడంతో వీటిని నివారించవచ్చును.
కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు అనేవి క్యాన్సర్ రకం, ఉపయోగించే కీమోథెరపీ ఔషధం, కీమోథెరపీ వ్యవధి మొదలైన వాటిపై ఆధారపడి మారవచ్చు. కొన్నిసార్లు ఇది ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్రపిండాలు లేదా పునరుత్పత్తి వ్యవస్థకు శాశ్వత నష్టం కలిగించవచ్చు. ఆంకోలాజికల్ బృందం ఈ దుష్ప్రభావాలను తగ్గించడానికి ఉత్తమంగా ప్రయత్నిస్తుంది.
అవును. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కీమోథెరపీ వల్ల సాధారణ జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది. ప్రతి సెషన్ తర్వాత వెంటనే కొంచెం అస్వస్థతకు గురవడం సర్వసాధారణం, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో వాటి నుంచి త్వరగా కోలుకోవచ్చు మరియు సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావచ్చు.
కీమోథెరపీ సమయంలో పెరుగు, తాజా పండ్లు, చీజ్, గుడ్లు, తృణధాన్యాలు, పాలు మొదలైన తేలికపాటి లేదా చప్పగా ఉండే ఆహారాలు తీసుకోవచ్చు.
ఖచ్చితంగా పొందవచ్చు, గర్భధారణ తర్వాత కీమోథెరపీని తీసుకోవచ్చు. కీమోథెరపీ తర్వాత గర్భవతి అయ్యే అవకాశాలు క్యాన్సర్ రకాన్ని బట్టి మరియు కీమోథెరపీ వ్యవధిపై ఆధారపడి ఉంటాయి.
అయినప్పటికీ, చివరి కీమోథెరపీ చికిత్స తీసుకున్న తర్వాత కనీసం ఆరు నెలల సమయం తర్వాత గర్భం కోసం ప్రయత్నించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విరామం అండాశయాలలో గుడ్ల పరిపక్వతకు సహాయపడుతుంది. కొన్ని సందర్భాలలో కీమోథెరపీ యొక్క ఏదైనా చిన్న మొత్తాలు హానికరం కలిగించవచ్చు. అరుదైన సందర్భాల్లో, కీమోథెరపీ తర్వాత వెంటనే గర్భం దాల్చడం వల్ల లోపాలతో పిల్లలు పుట్టడం లేదా గర్భస్రావం జరిగే సందర్భాలు ఉంటాయి.
సాధారణంగా, క్యాన్సర్ కీమోథెరపీ సమయంలో ఆకలి తగ్గుదల కనిపిస్తుంది. ఇది మారిన రుచి వల్ల గాని లేదా బుక్కల్ గాని ఓటోలారింగోలాజిక్ ప్రాంతాలలో అభివృద్ధి చెందిన సమస్యల వల్ల గాని కావచ్చు. వికారం, వాంతులు మరియు ఎప్పుడూ ప్రబలంగా ఉండే అలసట కూడా ఈ ఆకలి తగ్గడానికి దోహదం చేస్తాయి.
అయినప్పటికీ, దీనిని ఈ క్రింది విధానాలతో అధిగమించవచ్చు;
హైదరాబాద్‌లో కీమోథెరపీకి, ఒక్కో సెషన్‌కు సగటు ఖర్చు ₹ 4,500 నుండి ₹ 8,000 (INR నాలుగు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు) వరకు ఉంటుంది.
అయితే, హైదరాబాద్‌లో కీమోథెరపీ ధర రోగి వయస్సు, రోగి పరిస్థితి, క్యాన్సర్ రకం, వ్యాధి యొక్క దశ, ఉపయోగించే కీమోథెరపీ ఔషధాల రకాలు, చికిత్స వ్యవధి మరియు CGHS, ESI, EHS, బీమా లేదా కార్పొరేట్ వంటి బహుళ కారకాలపై ఆధారపడి ఉంటుంది.
భారతదేశంలో కీమోథెరపీ ఔషధాల ధర ఒక్కో సెషన్‌కు సగటున ₹ 4,000 నుండి ₹ 10,000 (INR నాలుగు వేల నుండి పది వేలు) వరకు ఉంటుంది. అయితే, భారతదేశంలోని వివిధ నగరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులలో కీమోథెరపీ చికిత్స ధర మారుతూ ఉంటుంది. అరుదైన రకాల క్యాన్సర్లు లేదా ఎక్కువ కీమోథెరపీ సెషన్ల చికిత్స చేయించుకోవాల్సిన రోగులకు ఖర్చు ఎక్కువగా ఉండే సందర్భాలు ఉంటాయి.
భారతదేశంలో కీమోథెరపీ ఖర్చును ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఉన్నాయి, అవేవనగా:
By clicking on Subscribe Now, you accept to receive communications from PACE Hospitals on email, SMS and Whatsapp.
Thank you for subscribing. Stay updated with the latest health information.
Oops, there was an error. Please try again submitting your details.
Payment in advance for treatment (Pay in Indian Rupees)
For Bank Transfer:-
Bank Name: HDFC
Company Name: Pace Hospitals
A/c No.50200028705218
IFSC Code: HDFC0000545
Bank Name: STATE BANK OF INDIA
Company Name: Pace Hospitals
A/c No.62206858997
IFSC Code: SBIN0020299
Scan QR Code by Any Payment App (GPay, Paytm, Phonepe, BHIM, Bank Apps, Amazon, Airtel, Truecaller, Idea, Whatsapp etc)
Disclaimer
General information on healthcare issues is made available by PACE Hospitals through this website (www.pacehospital.com), as well as its other websites and branded social media pages. The text, videos, illustrations, photographs, quoted information, and other materials found on these websites (here by collectively referred to as "Content") are offered for informational purposes only and is neither exhaustive nor complete. Prior to forming a decision in regard to your health, consult your doctor or any another healthcare professional. PACE Hospitals does not have an obligation to update or modify the "Content" or to explain or resolve any inconsistencies therein.
The "Content" from the website of PACE Hospitals or from its branded social media pages might include any adult explicit "Content" which is deemed exclusively medical or health-related and not otherwise. Publishing material or making references to specific sources, such as to any particular therapies, goods, drugs, practises, doctors, nurses, other healthcare professionals, diagnoses or procedures is done purely for informational purposes and does not reflect any endorsement by PACE Hospitals as such.