గర్భాశయ క్యాన్సర్ - లక్షణాలు, కారణాలు, నిర్ధారణ, చికిత్స & నివారణ

PACE Hospitals

పరిచయం | ప్రాబల్యం | రకాలు | కారణాలు | లక్షణాలు | ప్రమాద కారకాలు | సమస్యలు | నిర్ధారణ | చికిత్స | నివారణ | జాగ్రత్తలు | గర్భాశయ మరియు అండాశయ క్యాన్సర్ మధ్య తేడాలు | తరచుగా అడిగే ప్రశ్నలు | డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి


గర్భాశయ క్యాన్సర్ పరిచయం

Cervical Cancer Meaning in Telugu

గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో కనిపించే తీవ్రమైన వ్యాధి. ఇది గర్భాశయ ముఖ ద్వారం (Cervix) అనే భాగంలో ఏర్పడుతుంది, అంటే గర్భాశయం మరియు యోనిని కలిపే చోట కణాలు నియంత్రణ తప్పి వేగంగా పెరిగి గడ్డగా మారినప్పుడు ఈ వ్యాధి వస్తుంది.


సాధారణంగా మన శరీరంలోని కణాలు అవసరమైనప్పుడు మాత్రమే పెరుగుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి నియంత్రణ తప్పి వేగంగా విస్తరిస్తాయి, దాంతో ట్యూమర్ (గడ్డ) ఏర్పడుతుంది.


గర్భాశయ ముఖ ద్వారం గర్భధారణ సమయంలో శిశువును గర్భాశయంలో ఉంచటానికి సహాయపడుతుంది. అలాగే ప్రసవ సమయంలో శిశువు బయటకు రావడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.


కొంతమంది మహిళల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) అనే వైరస్ ఎక్కువకాలం ఉంటే, అది గర్భాశయ ముఖ ద్వారంలోని కణాలను ప్రభావితం చేస్తుంది. కాలక్రమంలో ఈ కణాలు మార్పు చెంది గర్భాశయ క్యాన్సర్కు దారితీస్తాయి.


ఈ ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి:


  • బినైన్ (హానికరంకాని గడ్డలు): ఇవి క్యాన్సర్గా మారవు.
  • మాలిగ్నెంట్ (క్యాన్సర్ గడ్డలు): ఇవి వేగంగా పెరిగి ఇతర అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది

గర్భాశయ క్యాన్సర్ ప్రబలత

Cervical Cancer Prevalence in Telugu

ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ ప్రబలత

Cervical Cancer Prevalence Worldwide in Telugu

గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో ఒకటి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.27 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సుమారు 6.5% వాటాను కలిగి ఉంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు అధికంగా ఉంటాయి, ముఖ్యంగా స్క్రీనింగ్ సదుపాయాల కొరత మరియు HPV వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణాలు.


ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మరియు దక్షిణాసియా ప్రాంతాల్లో ఈ వ్యాధి మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. సమయానికి పాప్ స్మియర్ టెస్ట్ మరియు HPV వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ను 90 శాతం వరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ ప్రబలత

Prevalence of Cervical Cancer in India in Telugu

భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి సంవత్సరం సుమారు 1.22 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి, మరియు సుమారు 67,000 మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు.


భారత మహిళల్లో సుమారు 1.6% మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం, మరియు 1% వరకు మరణించే ప్రమాదం ఉంది.

తాజా లాన్సెట్ అధ్యయనం ప్రకారం, భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ రేట్లు గత దశాబ్దంలో తగ్గుముఖం పట్టాయి. దీని కారణాలు:


  • మహిళల్లో అవగాహన పెరగడం
  • గర్భాశయ ముఖ ద్వారం స్క్రీనింగ్ (Pap smear) పరీక్షలు పెరగడం
  • HPV వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం
  • పట్టణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం


అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ స్క్రీనింగ్ సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల, అక్కడ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Types of Cervical Cancer in Telugu | గర్భాశయ క్యాన్సర్ రకాలు |  Cervical Cancer Types in Telugu

గర్భాశయ క్యాన్సర్ రకాలు

Types of Cervical Cancer in Telugu

గర్భాశయ ముఖ ద్వారం (Cervix) అనేది గర్భాశయాన్ని యోనితో కలిపే సన్నని గొట్టం వంటి భాగం. ఇది గర్భాశయాన్ని బాహ్య ప్రాజనన మార్గంతో (వజైనా) కలిపే ద్వారంలా పనిచేస్తుంది.


ఇది రెండు ప్రధాన భాగాలుగా ఉంటుంది:


  • ఎక్టోసర్విక్స్ (బయటి భాగం): ఇది యోనికి సమీపంగా ఉంటుంది. ఈ భాగం స్క్వామస్ కణజాలంతో (squamous epithelium) కప్పబడి ఉంటుంది. ఇవి చర్మం లాంటి రక్షణ కణాలు.


  • ఎండోసర్విక్స్ (లోపలి భాగం): ఇది గర్భాశయానికి సమీపంగా ఉంటుంది. ఇందులో గ్రంధి కణజాలం (glandular epithelium) ఉంటుంది. ఈ కణాలు శ్లేష్మం (mucus) ఉత్పత్తి చేస్తాయి, ఇది గర్భధారణలో మరియు ఫర్టిలిటీలో సహాయపడుతుంది.


ఈ భాగాల్లో ఏ కణజాలం నుండి క్యాన్సర్ ప్రారంభమవుతుందో దాని ఆధారంగా గర్భాశయ క్యాన్సర్ రెండు ప్రధాన రకాలుగా విభజించబడుతుంది. అవి:


  • స్క్వామస్ సెల్ కార్సినోమా
  • అడినోకార్సినోమా

స్క్వామస్ సెల్ కార్సినోమా

ఇది అత్యంత సాధారణంగా కనిపించే రకం. దాదాపు 70 నుండి 80 శాతం గర్భాశయ క్యాన్సర్ కేసులు ఈ రకానికి చెందుతాయి. ఇది గర్భాశయ ముఖ ద్వారం బయట పొర (ఎక్టోసర్విక్స్) లోని స్క్వామస్ కణాల్లో మొదలవుతుంది. మొదట ఇది నెమ్మదిగా పెరుగుతుంది కానీ సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

అడినోకార్సినోమా

ఇది గర్భాశయ ముఖ ద్వారం లోపలి భాగం (ఎండోసర్విక్స్) లోని గ్రంధి కణాల్లో మొదలవుతుంది. ఈ రకం క్యాన్సర్ సుమారు 15 నుండి 20 శాతం వరకు మాత్రమే కనిపిస్తుంది. ఇది ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది లోపలి భాగంలో ఏర్పడుతుంది మరియు ప్రారంభంలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు.

మిశ్రమ రకం (అడినోస్క్వామస్ కార్సినోమా)

కొన్ని అరుదైన సందర్భాల్లో రెండు రకాల కణాలు స్క్వామస్ మరియు గ్రంధి కణాలు కలిపి క్యాన్సర్‌గా మారతాయి. దీనిని అడినోస్క్వామస్ కార్సినోమా అంటారు.

ఇతర అరుదైన రకాల క్యాన్సర్లు

చాలా అరుదుగా గర్భాశయ ముఖ ద్వారంలో ఇతర రకాల క్యాన్సర్లు కూడా కనిపించవచ్చు, వాటిలో:


  • న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లు
  • లింఫోమా
  • సార్కోమా


ఇవి చాలా అరుదైన రకాలు అయినప్పటికీ, వేగంగా పెరిగే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత అవసరం.

గర్భాశయ క్యాన్సర్ కారణాలు

Cervical Cancer Causes in Telugu

గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) అనే వైరస్. ఇది లైంగిక సంబంధాల ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. HPV చాలా సాధారణమైన వైరస్ అయినప్పటికీ, దాదాపు 100 రకాలలో కొన్ని ప్రత్యేక రకాలు, ముఖ్యంగా HPV 16 మరియు HPV 18, గర్భాశయ ముఖ ద్వారం కణాలను ప్రభావితం చేసి క్యాన్సర్కు దారితీస్తాయి.


HPV ఇన్ఫెక్షన్ కారణంగా గర్భాశయ ముఖ ద్వారం కణాల్లో మార్పులు సంభవిస్తాయి. మొదట ఇవి స్వల్పంగా ఉండి ఎటువంటి సమస్యలు ఇవ్వకపోవచ్చు, కానీ వైరస్ శరీరంలో ఎక్కువ కాలం ఉండిపోతే ఈ కణాలు నియంత్రణ తప్పి పెరుగుతాయి. దీర్ఘకాలంగా చికిత్స లేకుండా వదిలేస్తే ఈ కణ మార్పులు క్రమంగా క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (IARC) HPVని మానవ క్యాన్సర్లకు ప్రధాన కారణమైన వైరస్గా గుర్తించాయి. HPVతో పాటు కొన్ని అరుదైన పరిస్థితుల్లో ఇతర ఇన్ఫెక్షన్లు లేదా దీర్ఘకాల వాపు కూడా గర్భాశయ ముఖ ద్వారం కణజాలాన్ని దెబ్బతీసి క్యాన్సర్ వృద్ధికి కారణమవుతాయి.

Cervical Cancer Symptoms in Telugu | గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు | Symptoms of Cervical Cancer in Telugu

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు

Cervical Cancer Symptoms in Telugu

గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ దశల్లో సాధారణంగా ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ఈ దశలో ఎక్కువమంది మహిళలు తాము అనారోగ్యంగా ఉన్నారని కూడా గుర్తించలేరు. అందువల్ల ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి పాప్ స్మియర్ పరీక్ష మరియు HPV టెస్టింగ్ చాలా ముఖ్యమైనవి.


క్యాన్సర్ క్రమంగా పెరిగినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి:


  • మాసిక చక్రం (పీరియడ్స్) సమయంలో సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం
  • పీరియడ్స్ మధ్యలో లేదా తర్వాత రక్తస్రావం
  • లైంగిక చర్య తర్వాత రక్తస్రావం
  • యోని శుభ్రపరచేటప్పుడు రక్తస్రావం
  • పెల్విక్ పరీక్ష సమయంలో రక్తస్రావం
  • పెల్విక్ లేదా నడుం నొప్పి
  • యోని నుండి దుర్వాసన గల లేదా అధిక విసర్జన
  • మెనోపాజ్ సమయంలో రక్తస్రావం
  • లైంగిక చర్యలో నొప్పి లేదా అసౌకర్యం
Cervical Cancer Risk Factors in Telugu | గర్భాశయ క్యాన్సర్ ప్రమాద కారకాలు | Risk Factors of Cervical Cancer in Telugu

గర్భాశయ క్యాన్సర్ ప్రమాద కారకాలు

Cervical Cancer Risk Factors in Telugu

గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా కొన్ని ప్రమాద కారకాలతో సంబంధం కలిగి ఉంటుంది, కానీ ప్రతి ప్రమాద కారకం క్యాన్సర్కి నేరుగా కారణం అవుతుందని కాదు. కొన్నిసార్లు ఏ ప్రమాద కారకం లేకుండానే క్యాన్సర్ వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఈ ప్రమాద కారకాలు ఉన్నప్పటికీ క్యాన్సర్ అభివృద్ధి చెందదు.


గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచే ముఖ్యమైన కారకాలు ఇవి:


  • HPV ఇన్ఫెక్షన్: హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన ప్రమాద కారకం. సుమారు 100 రకాల HPV వైరస్లలో కొన్ని మాత్రమే క్యాన్సర్తో సంబంధం కలిగి ఉంటాయి, ముఖ్యంగా HPV 16 మరియు HPV 18. చిన్న వయస్సులో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం లేదా అనేక లైంగిక భాగస్వాములు కలిగి ఉండడం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం పెరుగుతుంది. HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.


  • రోగనిరోధక శక్తి తగ్గడం: శరీర రక్షణ శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలు; కార్టికోస్టెరాయిడ్ మందులు, అవయవ మార్పిడి (organ transplant), ఇతర క్యాన్సర్ల చికిత్సలు లేదా HIV/AIDS వంటి వ్యాధులు.


  • హెర్పీస్ ఇన్ఫెక్షన్: లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే హెర్పీస్ వైరస్ నోటి లేదా జననాంగ ప్రాంతాల్లో పుండ్లు కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.


  • పొగాకు వినియోగం: పొగ త్రాగడం లేదా గుట్కా, పాన్, చెయింగ్ టొబాకో వంటి పొగాకు ఉత్పత్తులు వాడే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం సాధారణ మహిళలతో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంటుంది.


  • వయస్సు: 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో గర్భాశయ క్యాన్సర్ చాలా అరుదుగా కనిపిస్తుంది, కానీ 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సులో ఈ ప్రమాదం పెరుగుతుంది. వయస్సు పెరిగిన తరువాత కూడా ఈ వ్యాధి రావచ్చు కాబట్టి, పాప్ స్మియర్ లేదా HPV టెస్ట్ ను సమయానికి చేయించుకోవడం అవసరం.


  • ఆర్థిక పరిస్థితులు: తక్కువ ఆదాయం కలిగిన మహిళల్లో స్క్రీనింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది.


  • మౌఖిక గర్భనిరోధక మాత్రలు: దీర్ఘకాలం బర్త్ కంట్రోల్ మాత్రలు వాడే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంత మేర పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.


  • డైఇథిల్ స్టిల్బెస్ట్రోల్ (DES): ఇది గర్భస్రావాన్ని నివారించడానికి పూర్వం ఉపయోగించిన ఔషధం. ఈ మందు తీసుకున్న మహిళల కుమార్తెలలో అరుదుగా గర్భాశయ లేదా యోని క్యాన్సర్ కనిపించవచ్చు.
Complications of Cervical Cancer in Telugu | గర్భాశయ క్యాన్సర్ సమస్యలు | Cervical Cancer Complications in Telugu

రొమ్ము క్యాన్సర్ వలన కలిగే సమస్యలు

Complications of Cervical Cancer in Telugu

గర్భాశయ క్యాన్సర్ ముదిరిన దశల్లో కేవలం గర్భాశయ ముఖ ద్వారం మాత్రమే కాకుండా, సమీప అవయవాలు మరియు కణజాలాలను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యాధి పురోగమించేకొద్దీ పేషెంట్కి పలు శారీరక సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన సమస్యలు ఇవి:


  • నొప్పి (Pain): క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది నాడులపై ఒత్తిడి, రక్తనాళాల మూసుకుపోవడం, ఇన్ఫెక్షన్ లేదా వాపు వల్ల సంభవిస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పి నడుము లేదా కాళ్ల వరకు వ్యాపిస్తుంది, ఇది పేషెంట్కి అసహనాన్ని కలిగిస్తుంది.


  • రక్తస్రావం (Bleeding): గర్భాశయ క్యాన్సర్ ఉన్న రోగుల్లో రక్తస్రావం సాధారణ సమస్య. ట్యూమర్ విస్తరించడం లేదా రక్తనాళాల దెబ్బతినడం వల్ల ఇది జరుగుతుంది. కొందరిలో ఇది తక్కువగా కనిపిస్తే, మరికొందరిలో తీవ్రమైన రక్తస్రావం సంభవిస్తుంది. రక్తనష్టం అధికమైతే రక్తహీనత (అనీమియా) లేదా ప్రాణాపాయం ఏర్పడవచ్చు.


  • యోని విసర్జన (Vaginal Discharge): క్యాన్సర్ కణజాలం దెబ్బతినడం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా యోనిలో నుండి దుర్వాసన గల లేదా పసుపు రంగులో స్రావం వస్తుంది. ఈ పరిస్థితి రోగికి శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడి మరియు సామాజిక ఇబ్బందులు కలిగిస్తుంది.


  • మూత్రపిండ సమస్యలు (Kidney-related Problems): గర్భాశయ ముఖ ద్వారం సమీపంలో ఉన్న మూత్రనాళాలు క్యాన్సర్ ఒత్తిడి వల్ల అడ్డం పడవచ్చు. దీని ఫలితంగా మూత్ర ప్రవాహం ఆగిపోవడం, మూత్రపిండాల్లో వాపు (హైడ్రోనెఫ్రోసిస్), యూరీమియా (రక్తంలో యూరియా పెరగడం) లేదా ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. ఈ సమస్యలు ముదిరితే ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది.


  • వెసికోవజైనల్ ఫిస్టులా (Vesicovaginal Fistula): క్యాన్సర్ ముదిరిన దశల్లో మూత్రాశయం మరియు యోని మధ్య రంధ్రం ఏర్పడవచ్చు. దీని వల్ల మూత్రం నిరంతరం లీక్ అవుతుంది. ఈ పరిస్థితి శారీరకంగా అసౌకర్యంగా ఉండటంతో పాటు మానసిక ఇబ్బందులు కూడా కలిగిస్తుంది.


  • రెక్టోవజైనల్ ఫిస్టులా (Rectovaginal Fistula): క్యాన్సర్ రేక్టం వరకు వ్యాపించినప్పుడు రేక్టం మరియు యోని మధ్య రంధ్రం ఏర్పడుతుంది. దీని వల్ల మల ప్రవాహం యోనిలోకి చేరుతుంది. ఈ పరిస్థితి రోగి జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ

Cervical Cancer Diagnosis in Telugu

గర్భాశయ క్యాన్సర్ను సమయానికి గుర్తించడం చాలా ముఖ్యం. సాధారణంగా ఈ వ్యాధి ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది కాబట్టి, నిర్ధారణకు వివిధ పరీక్షలు ఉపయోగిస్తారు.


ప్రధాన నిర్ధారణ పద్ధతులు:


  • పాప్ స్మియర్ పరీక్ష (Pap Smear Test)
  • HPV పరీక్ష (HPV Test)
  • కొల్పోస్కోపీ (Colposcopy)
  • సిస్టోస్కోపీ (Cystoscopy)
  • సిగ్మాయిడోస్కోపీ లేదా ప్రాక్టోస్కోపీ (Sigmoidoscopy / Proctoscopy)
  • ఎండోసర్వికల్ క్యూరెట్టేజ్ (Endocervical Curettage)
  • లూప్ ఎలక్ట్రో సర్జికల్ ఎక్సిషన్ (LEEP Procedure)
  • కోన్ బయాప్సీ లేదా కానైజేషన్ (Conization)
  • ఇమేజింగ్ పరీక్షలు 
  • ఎక్స్-రే పరీక్ష (X-ray)
  • అల్ట్రాసౌండ్
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
  • మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్
  • PET CT స్కాన్

గర్భాశయ క్యాన్సర్ చికిత్స

Cervical Cancer Treatment in Telugu

గర్భాశయ క్యాన్సర్ చికిత్స పేషెంట్ వయస్సు, వ్యాధి దశ (Stage), క్యాన్సర్ వ్యాప్తి స్థాయి మరియు ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. చికిత్స యొక్క ప్రధాన లక్ష్యాలు క్యాన్సర్ కణాలను తొలగించడం, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం మరియు రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడం.


గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ప్రధాన పద్ధతులు:


  • శస్త్రచికిత్స (Surgical treatment)
  • రేడియేషన్ థెరపీ (Radiation therapy)
  • కీమోథెరపీ (Chemotherapy)
  • టార్గెటెడ్ థెరపీ (Targeted therapy)
  • ఇమ్యూనోథెరపీ (Immunotherapy)

శస్త్రచికిత్స (Surgical Treatment)

  • గర్భాశయం మరియు గర్భాశయ ముఖ ద్వారం తొలగించడం (Hysterectomy)
  • లింఫ్ నోడ్స్ తొలగించడం (Lymph Node Dissection)
  • పెల్విక్ ఎక్సెంటరేషన్ (Pelvic Exenteration) — అడ్వాన్స్డ్ స్టేజెస్లో

రేడియేషన్ థెరపీ (Radiation Therapy)

  • బయటి రేడియేషన్ చికిత్స (External Beam Radiation Therapy)
  • అంతర్గత రేడియేషన్ చికిత్స (Brachytherapy)
  • శస్త్రచికిత్స ముందు లేదా తర్వాత కీమోథెరపీతో కలిపి ఇవ్వవచ్చు.

కీమోథెరపీ (Chemotherapy)

  • క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే ఔషధాలు.
  • సాధారణంగా రేడియేషన్తో కలిపి ఇస్తారు.

టార్గెటెడ్ థెరపీ (Targeted Therapy)

  • క్యాన్సర్ కణాల పెరుగుదలలో భాగమైన నిర్దిష్ట ప్రోటీన్లను అడ్డుకునే ఔషధాలు.
  • ఇతర చికిత్సలకు స్పందించని పేషెంట్స్ లో ఉపయోగిస్తారు.

ఇమ్యూనోథెరపీ (Immunotherapy)

రోగనిరోధక వ్యవస్థను బలపరచి క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేసే ఆధునిక చికిత్స పద్ధతి.

సాధారణంగా ముదిరిన దశల్లో లేదా ఇతర చికిత్సల తర్వాత ఉపయోగిస్తారు.

Why Choose PACE Hospitals?

Expert Cancer Specialist Doctors for Cervical Cancer

Expert Super Specialist Doctors

Advanced Diagnostics & Treatment for Cervical Cancer

Advanced Diagnostics & Treatment

Affordable & Transparent Care for Cervical Cancer

Affordable & Transparent Care

24x7 Emergency & ICU Support for Cervical Cancer

24x7 Emergency & ICU Support

For Online Doctor Consultation

గర్భాశయ క్యాన్సర్ నివారణ

Cervical Cancer Prevention in Telugu

గర్భాశయ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం లేదా పూర్తిగా నివారించడం సాధ్యమవుతుంది. ఇందుకోసం HPV వ్యాక్సిన్, పాప్ స్మియర్ పరీక్ష, మరియు నియమిత స్క్రీనింగ్ టెస్టులు చాలా ముఖ్యమైనవి. ఈ చర్యల ద్వారా గర్భాశయ ముఖ ద్వారంలో కణాల్లో జరిగే మార్పులను ముందుగానే గుర్తించి క్యాన్సర్గా మారకుండా అడ్డుకోవచ్చు.

HPV వ్యాక్సిన్ 

  • HPV వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) నుంచి రక్షణ ఇస్తుంది.
  • అమెరికా FDA ఈ వ్యాక్సిన్ను 9 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మహిళలు మరియు పురుషుల కోసం ఆమోదించింది.
  • భారతదేశంలో సర్వావాక్ (CERVAVAC) అనే స్వదేశీ HPV వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది మరియు DCGI ఆమోదం పొందింది.
  • ఈ టీకాను సాధారణంగా 9 సంవత్సరాల వయస్సు నుంచే ఇవ్వడం ప్రారంభించవచ్చు.
  • టీకా మోతాదు మరియు షెడ్యూల్ వయస్సు, లింగం మరియు ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి మారవచ్చు.

స్క్రీనింగ్ పరీక్షలు

  • పాప్ స్మియర్ పరీక్ష (Pap Smear) మరియు HPV టెస్ట్ ద్వారా గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులను ముందుగానే గుర్తించవచ్చు.
  • 21 సంవత్సరాల పైబడి ఉన్న మహిళలు ఈ పరీక్షలను నియమితంగా చేయించుకోవడం అవసరం.
  • ఈ పరీక్షలు గర్భాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి సమయానికి చికిత్స చేయడంలో సహాయపడతాయి.

జీవనశైలిలో మార్పులు

  • లైంగిక సంబంధాల ప్రారంభాన్ని వయోజన దశ వరకు వాయిదా వేయడం.
  • లైంగిక భాగస్వాముల సంఖ్యను పరిమితం చేయడం.
  • సురక్షిత లైంగిక పద్ధతులు పాటించడం (కండోమ్ లేదా డెంటల్ డ్యామ్ వాడడం).
  • జననాంగ ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నివారించడం.
  • పొగ త్రాగడం మరియు పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మానేయడం.
  • ఆరోగ్యకరమైన ఆహారం, సరైన బరువు మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.

గర్భాశయ క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ మధ్య తేడాలు

Difference between Ovarian and Cervical Cancer in Telugu

గర్భాశయ క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ రెండూ మహిళల్లో సాధారణంగా కనిపించే ప్రజనన వ్యవస్థ క్యాన్సర్లు. అయినప్పటికీ, వీటి ఉద్భవ స్థానం, లక్షణాలు మరియు నిర్ధారణ పద్ధతులు భిన్నంగా ఉంటాయి.

Cervical vs Ovarian Cancer in Telugu

అంశం గర్భాశయ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్
ఉద్భవించే భాగం గర్భాశయ ముఖ ద్వారం (Cervix) గర్భాశయ అండాశయాలు (Ovaries)
ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్ జన్యు మార్పులు (BRCA1, BRCA2), కుటుంబ చరిత్ర, వయస్సు
ప్రధాన లక్షణాలు సంభోగం తర్వాత రక్తస్రావం, దుర్వాసన గల యోని స్రావం, పెల్విక్ నొప్పి పొత్తికడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, జీర్ణ సమస్యలు, తరచు మూత్రం పోవడం
గుర్తించే దశ పాప్ స్మియర్ మరియు HPV టెస్ట్ ద్వారా ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు సాధారణంగా చివరి దశల్లో గుర్తించబడుతుంది ఎందుకంటే ప్రారంభ లక్షణాలు అస్పష్టంగా ఉంటాయి
నివారణ మార్గం పాప్ స్మియర్ మరియు HPV టెస్ట్ ద్వారా ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు జన్యు పరీక్షలు, కుటుంబ చరిత్ర ఉన్నవారికి పర్యవేక్షణ, హార్మోనల్ బ్యాలెన్స్
ప్రధాన చికిత్స శస్త్రచికిత్స, కిరణ చికిత్స, కీమోథెరపీ శస్త్రచికిత్స ద్వారా అండాశయాలు తొలగింపు, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ

గర్భాశయ క్యాన్సర్ పై తరచుగా అడిగే ప్రశ్నలు


  • గర్భాశయ క్యాన్సర్ నయం అవుతుందా?

    అవును. అవసరమైన చికిత్సలతో గర్భాశయ క్యాన్సర్ నయం అవుతుంది. ప్రారంభ దశలో ఉన్న గర్భాశయ క్యాన్సర్కి సాధారణంగా రాడికల్ హిస్టరెక్టమీ (Radical Hysterectomy) అనే శస్త్రచికిత్స చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో గర్భాశయం, గర్భాశయ ముఖ ద్వారం, యోనిలోని ఒక భాగం మరియు సమీప లింఫ్ నోడ్స్ తొలగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ పూర్తిగా నయం కావచ్చు మరియు తిరిగి రావడాన్ని నివారించవచ్చు. అయితే గర్భాశయం తొలగించడం వలన మహిళ గర్భధారణకు అనర్హురాలవుతుంది.

  • గర్భాశయ క్యాన్సర్ లైంగిక వ్యాధినా?

    గర్భాశయ క్యాన్సర్ స్వయంగా లైంగిక వ్యాధి కాదు, కానీ దీని ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. అంటే, HPV ఇన్ఫెక్షన్ ఒక లైంగికంగా వ్యాప్తి చెందే వ్యాధి (STD), కానీ గర్భాశయ క్యాన్సర్ మాత్రం ఆ ఇన్ఫెక్షన్ వల్ల దీర్ఘకాలంలో అభివృద్ధి చెందుతుంది. ప్రతి HPV ఇన్ఫెక్షన్ క్యాన్సర్కు దారితీయదు, కానీ హై రిస్క్ రకాల HPV (HPV-16, HPV-18) ఎక్కువకాలం శరీరంలో ఉంటే గర్భాశయ కణాల్లో మార్పులు జరిగి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. HPV వ్యాక్సిన్ తీసుకోవడం మరియు నియమిత స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

  • గర్భాశయ క్యాన్సర్ అంటువ్యాధినా?

    లేదు. గర్భాశయ క్యాన్సర్ అంటువ్యాధి కాదు, అంటే ఇది వ్యక్తి నుండి మరొకరికి నేరుగా వ్యాపించదు. అయితే, దీని ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వైరస్. అందువల్ల, క్యాన్సర్ కాదు కానీ, HPV ఇన్ఫెక్షన్ మాత్రం అంటువ్యాధి లాంటిది. ఇది లైంగిక సంబంధాల సమయంలో వ్యాపిస్తుంది.

    HPV వ్యాక్సిన్ తీసుకోవడం మరియు సురక్షిత లైంగిక పద్ధతులు పాటించడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

  • గర్భాశయ క్యాన్సర్ ప్రాణాంతకమా?

    గర్భాశయ క్యాన్సర్ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది, కానీ ఇది ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. ప్రారంభ దశల్లో ఈ క్యాన్సర్ను శస్త్రచికిత్స, కిరణ చికిత్స లేదా కీమోథెరపీ ద్వారా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అయితే, వ్యాధి ఆలస్యంగా గుర్తిస్తే ఇది ఇతర అవయవాలకు వ్యాపించి ప్రాణానికి ప్రమాదం కలిగించవచ్చు. నియమిత పాప్ స్మియర్ మరియు HPV పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి, ప్రాణాపాయాన్ని నివారించవచ్చు.

  • గర్భాశయ క్యాన్సర్ వంశపారంపర్యమా?

    సాధారణంగా గర్భాశయ క్యాన్సర్ వంశపారంపర్య వ్యాధి కాదు. ఇది ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో కుటుంబ చరిత్ర ఉన్న మహిళల్లో ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. అంటే తల్లి లేదా అక్క వంటి బంధువులకు గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లయితే, HPV ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది నేరుగా జన్యువుల ద్వారా వారసత్వంగా రాదు. నియమిత HPV టెస్ట్, పాప్ స్మియర్ మరియు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు.

గర్భాశయ క్యాన్సర్‌కి ఏ చికిత్సలు ఉంటాయి?

గర్భాశయ క్యాన్సర్కి ఉపయోగించే ప్రధాన చికిత్సలు ఇవి:


  • శస్త్రచికిత్స (Surgery)
  • కిరణ చికిత్స (Radiation Therapy)
  • కీమోథెరపీ (Chemotherapy)
  • టార్గెటెడ్ థెరపీ (Targeted Therapy)
  • ఇమ్యూనోథెరపీ (Immunotherapy)


చికిత్స రకం క్యాన్సర్ దశ, రోగి ఆరోగ్యం, వయస్సు మరియు పక్క ప్రభావాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ చికిత్సలు లైంగిక సామర్థ్యంపై లేదా సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ను ఎలా గుర్తిస్తారు?

గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణకు ఉపయోగించే ప్రధాన పరీక్షలు ఇవి:


  • పాప్ స్మియర్ పరీక్ష (Pap Smear)
  • హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టైపింగ్ టెస్ట్
  • కొల్పోస్కోపీ (Colposcopy)
  • సిస్టోస్కోపీ (Cystoscopy)
  • సిగ్మాయిడోస్కోపీ లేదా ప్రాక్టోస్కోపీ (Sigmoidoscopy / Proctoscopy)
  • ఎండోసర్వికల్ క్యూరెట్టేజ్ (Endocervical Curettage)
  • లూప్ ఎలక్ట్రో సర్జికల్ ఎక్సిషన్ (LEEP Procedure)
  • కోన్ బయాప్సీ లేదా కానైజేషన్ (Conization)
  • ఎక్స్-రే పరీక్ష (X-ray)
  • అల్ట్రాసౌండ్ (Ultrasound)
  • సీటీ స్కాన్ (CT Scan)
  • ఎంఆర్ఐ స్కాన్ (MRI Scan)
  • పీఈటీ లేదా పీఈటీ-సీటీ స్కాన్ (PET / PET-CT Scan)

గర్భాశయ క్యాన్సర్ను ఇంట్లో గుర్తించగలమా?

కాదు. గర్భాశయ క్యాన్సర్ను ఇంట్లో గుర్తించే నమ్మకమైన మార్గాలు లేవు. ఈ వ్యాధిని కేవలం ఆంకాలజిస్ట్ మాత్రమే ఆసుపత్రి పరిసరాల్లో, వివిధ నిర్ధారణ పరీక్షల ఆధారంగా నిర్ధారించగలరు. ఇప్పటివరకు గర్భాశయ క్యాన్సర్ను ఇంట్లోనే గుర్తించే టెక్నాలజీ అభివృద్ధి కాలేదు.

గర్భాశయ క్యాన్సర్ ఎంతకాలం తెలియకుండా ఉండవచ్చు?

గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణం HPV ఇన్ఫెక్షన్. ఈ వైరస్ శరీరంలో చాలా సంవత్సరాలు ఉండి గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులు కలిగిస్తుంది. దీనిని సర్వికల్ ఇంట్రాథెలియల్ నెయోప్లాసియా (CIN) అంటారు, ఇది క్యాన్సర్కి ముందున్న దశ. HPV ఇన్ఫెక్షన్ నుంచి CIN దశకు, అక్కడి నుంచి క్యాన్సర్ దశకు మారడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. సాధారణంగా 10 నుండి 20 సంవత్సరాల సమయం పడుతుంది.

గర్భాశయ క్యాన్సర్ దశలు ఏమిటి?

FIGO (International Federation of Gynaecology and Obstetrics) ప్రకారం గర్భాశయ క్యాన్సర్ను ఐదు దశలుగా విభజిస్తారు:

  • Stage 0
  • Stage I
  • Stage II
  • Stage III
  • Stage IV

Stage 0 మరియు Stage I లో క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారంలో మాత్రమే ఉంటుంది, Stage II నుండి Stage IV వరకు క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.

HPV వైరస్ గర్భాశయ క్యాన్సర్‌కి కారణమవుతుందా?

అవును. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్కి ప్రధాన కారణం. ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది మరియు మహిళల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. కొన్ని రకాల HPVలు హానికరమేమీ కావు, కానీ HPV-16 మరియు HPV-18 వంటి అధిక ప్రమాద రకాల వైరస్లు గర్భాశయ కణాల్లో మార్పులు కలిగించి క్యాన్సర్కి దారితీస్తాయి. అందుకే HPV వ్యాక్సిన్ తీసుకోవడం మరియు నియమిత పాప్ స్మియర్ లేదా HPV టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించవచ్చు.

పురుషులకు గర్భాశయ క్యాన్సర్ వస్తుందా?

లేదు. పురుషులకు గర్భాశయ క్యాన్సర్ రావడం సాధ్యంకాదు, ఎందుకంటే గర్భాశయం (Uterus) మరియు గర్భాశయ ముఖ ద్వారం (Cervix) మహిళల్లో మాత్రమే ఉంటాయి. అయితే, పురుషులు కూడా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్కి గురవవచ్చు. ఈ వైరస్ పురుషుల్లో పురుషాంగం, గుదం, గొంతు మరియు నోటి క్యాన్సర్లు వంటి ఇతర రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. అందువల్ల, పురుషులు కూడా HPV వ్యాక్సిన్ తీసుకోవడం మరియు సురక్షిత లైంగిక పద్ధతులు పాటించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవాలి.

గర్భాశయ క్యాన్సర్ ఎంత సాధారణంగా ఉంటుంది?

గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్గా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మహిళలు ఈ వ్యాధితో కొత్తగా బాధపడుతున్నారు. భారతదేశంలో మాత్రమే ప్రతి సంవత్సరం సుమారు 1.2 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, మరియు గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ లేమి కారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, HPV వ్యాక్సిన్ తీసుకోవడం, నియమిత పాప్ స్మియర్ మరియు HPV టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి పూర్తిగా నివారించవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ వల్ల దురద కలుగుతుందా?

సాధారణంగా గర్భాశయ క్యాన్సర్ వల్ల నేరుగా దురద (itching) రావడం జరగదు. అయితే, క్యాన్సర్ కారణంగా వచ్చే స్రావం (discharge) లేదా ఇన్ఫెక్షన్ వలన యోని ప్రాంతంలో స్వల్ప దురద లేదా అసౌకర్యం అనిపించవచ్చు. దురద ఎక్కువగా ఉంటే లేదా దుర్వాసన గల స్రావం, కాలుతున్న భావం వంటి లక్షణాలు ఉన్నప్పుడు అది ఇతర ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ కారణంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవడం మంచిది.

గర్భాశయ క్యాన్సర్ కోసం ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి?

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు కొన్ని రోజులపాటు కొనసాగితే, మరింత తీవ్రమైతే లేదా రోజువారీ పనుల్లో ఇబ్బంది కలిగిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కింది లక్షణాలు ఉన్నప్పుడు జాగ్రత్త అవసరం:


  • లైంగిక సంబంధం తర్వాత లేదా పీరియడ్స్ మధ్య రక్తస్రావం
  • మెనోపాజ్ తర్వాత రక్తస్రావం
  • దుర్వాసన గల లేదా నీరుగా ఉన్న యోని స్రావం
  • వెన్ను లేదా పొత్తికడుపు నొప్పి
  • లైంగిక చర్య సమయంలో అసౌకర్యం లేదా నొప్పి
  • మూత్రం పోయేటప్పుడు నొప్పి లేదా ఇబ్బంది


ఈ లక్షణాలు తగ్గకపోతే గైనకాలజిస్టు లేదా ఆంకాలజిస్టుని సంప్రదించాలి. తీవ్ర రక్తస్రావం లేదా నొప్పి ఉన్నప్పుడు అత్యవసర వైద్య సహాయం పొందడం అవసరం. ప్రారంభ దశలో గుర్తించడం చికిత్సను మరింత ప్రభావవంతంగా చేస్తుంది.

Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

World Immunization Day 10 November 2025 - Importance, Theme & History
By PACE Hospitals November 8, 2025
World Immunization Day 2025 highlights the importance of vaccines in preventing life-threatening diseases and protecting global health. Learn how timely immunization safeguards children and adults, prevents outbreaks, and supports community well-being.
can cancer be detected in ct scan | can a ct scan detect cancer | how to detect cancer
By PACE Hospitals November 8, 2025
Learn how CT scans detect cancer, which types are most accurate, accuracy rates, and what to expect during the scan. Expert guide to CT imaging for cancer.
World Neuroendocrine Cancer Day 10 November 2025 - Importance, Theme & History
By Pace Hospitals November 8, 2025
World Neuroendocrine Cancer Day aims to raise awareness about neuroendocrine tumours (NETs), their symptoms, early detection, and treatment options. Learn how PACE Hospitals supports advanced diagnosis, multidisciplinary care, and better outcomes for patients living with NETs.
World Keratoconus Day 10 November 2025 - Importance & History
By Pace Hospitals November 8, 2025
World Keratoconus Day raises awareness about keratoconus — a progressive eye condition that affects the cornea and vision clarity. Learn about early symptoms, diagnosis, and advanced treatment options available at PACE Hospitals, Hyderabad, to preserve and protect your vision.
how to cure frozen shoulder quickly | how to treat frozen shoulder | what is the best treatment for
By PACE Hospitals November 8, 2025
Discover proven methods to treat frozen shoulder effectively. Expert guidance on exercises, therapy, medical treatments, and recovery timelines to regain mobility and reduce pain.
World Radiography Day 8 November 2025 - Importance, Theme & History
By Pace Hospitals November 7, 2025
Celebrate World Radiography Day with PACE Hospitals — honoring radiographers for their vital role in accurate diagnosis, advanced imaging, and compassionate patient care.