ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి: లక్షణాలు, కారణాలు, నిర్ధారణ & చికిత్సపై డాక్టర్ ఎమ్. సుధీర్ వివరణ
ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (Inflammatory Bowel Disease - IBD) అనేది ఓ దీర్ఘకాలిక ప్రేగుల (ఆంత్రాల) వాపుతో కూడిన వ్యాధి. దీనిలో ముఖ్యంగా రెండు రకాలుంటాయి – క్రోన్స్ వ్యాధి (Crohn’s Disease), మరియు అల్సరేటివ్ కొలైటిస్ (Ulcerative Colitis). ఈ ఈ వ్యాధుల వల్ల ప్రేగులలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి, పొట్ట నొప్పి, విరేచనాలు (తీవ్రంగా లేదా రక్తంతో కూడినవి కూడా కావచ్చు), బరువు తగ్గిపోవడం, అలసట ,భోజనంపై ఆసక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణాలు పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా, వంశపారంపర్య కారణాలు, రోగనిరోధక వ్యవస్థలో మార్పులు, పేగు సూక్ష్మజీవులు, మరియు జీవనశైలి ప్రభావాలు ఉండవచ్చు.
ఈ వీడియోలో ప్రముఖ గాస్ట్రోఎంటరాలజిస్ట్
డాక్టర్ ఎమ్. సుధీర్ గారు ఈ వ్యాధి ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఎలా గుర్తించాలి, ఏ పరీక్షలు చేయాలి, ఎలాంటి మందులు వాడాలి, ఆహార శైలి & జీవనశైలిలో మార్పులు ఎలా ఉండాలి అన్న విషయాలను సులభంగా వివరంగా తెలియజేస్తారు. ఈ వీడియో ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD) పై సరైన అవగాహన పెంచి, సమయానికి వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకునేందుకు సహాయపడుతుంది.
Related Resources


Share on
Request an appointment
Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868