గర్భాశయ ఫైబ్రాయిడ్ల: లక్షణాలు, రకాలు, కారణాలు, సమస్యలు, రోగ నిర్ధారణ, చికిత్స & నివారణ

Pace Hospitals

గర్భాశయంలోని కండర కణజాలం నుండి పెరిగే క్యాన్సర్ కాని పెరుగుదలలను (కండరాల గడ్డలను) గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా లియోమయోమాస్ లేదా మయోమాస్ అని అంటారు. గర్భాశయ ఫైబ్రాయిడ్ల యొక్క ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది, అయితే ఇది స్త్రీ గర్భాశయంలో కనిపించే అత్యంత అసాధారణతల్లో ఒకటి.

గర్భాశయ ఫైబ్రాయిడ్ల రకాలు

Types of Uterine Fibroids in Telugu


గర్భాశయం అనేది పియర్ (నేరేడు రకానికి చెందిన పండు) ఆకారంలో ఉండే అవయవం, ఇది మూత్రాశయం మరియు పురీషనాళం మధ్యలో ఉంటుంది. గర్భాశయం అనేది మూడు పొరలుగా విభజించబడింది - (బయటి, మధ్య మరియు లోపలి పొర). గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఈ పొరలలో దేని నుండి అయినా పెరగవచ్చు. గర్భాశయ ఫైబ్రాయిడ్లు అనేవి ఆరు రకాలుగా ఉన్నాయి, ఇవి వాటి స్థానాన్ని బట్టి వర్గీకరించబడ్డాయి:

  1. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు
  2. సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు
  3. సబ్‌ముకోసల్ ఫైబ్రాయిడ్లు
  4. పెడున్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్లు
  5. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వారపు) ఫైబ్రాయిడ్లు 
  6. బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్లు


1. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు

ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు అనేవి నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు మరియు ఇవి గర్భాశయ ఫైబ్రాయిడ్లలో అత్యంత సాధారణ రకం. ఇవి గర్భాశయ గోడ కండరాల లోపల పెరుగుతాయి. ఇవి పెరుగుదల యొక్క స్థానాన్ని బట్టి వర్గీకరించబడ్డాయి.

  • ఆంటీరియర్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ - గర్భాశయం యొక్క ముందు ఉండే కండరాల గోడ లోపల పెరుగుదల.
  • పోస్టిరియర్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ - గర్భాశయం యొక్క వెనుక ఉండే కండరాల గోడ లోపల పెరుగుదల.
  • ఫండల్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ - గర్భాశయం యొక్క పై కండరాల గోడలో పెరుగుదల.


2. సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు

సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు అనేవి నిరపాయమైన (కాన్సర్ కాని) పెరుగుదలలు మరియు ఇవి గర్భాశయ గోడ యొక్క బయటి కండరాలపై పెరుగుతాయి. 


ఇవి కూడా గర్భాశయ ఫైబ్రాయిడ్ల యొక్క రకాలలో సాధారణ రకం. ఇది ఒక పెద్ద పెరుగుదల లాగా గాని చిన్న పెరుగుదల లాగా గాని పెరుగుతుంది. ఇది సాధారణంగా తీవ్రమైన కటి నొప్పికి కారణమవుతుంది.


3. సబ్‌మ్యుకోసల్ ఫైబ్రాయిడ్లు 

సబ్‌మ్యుకోసల్ ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయం యొక్క నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు సాధారణంగా, ఇవి స్త్రీల యొక్క పునరుత్పత్తి వయస్సులో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నేరుగా గర్భాశయ లోపలి పొర క్రింద ఉన్న గర్భాశయ కుహరంలోకి పెరుగుతుంది. 


సాధారణంగా, ఇవి అతి తక్కువగా వచ్చే గర్భాశయ ఫైబ్రాయిడ్లు (స్త్రీల లో తక్కువగా వచ్చే ఫైబ్రాయిడ్‌ రకం), అయితే ఇవి పీరియడ్స్ (రుతుక్రమం) సమయంలో లేదా ఋతుచక్రం మధ్యలో ఎక్కువ రక్తస్రావం, కటి నొప్పి లేదా నడుము నొప్పి లాంటి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తాయి. 


4. పెడన్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్

పెడన్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయం యొక్క నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు. ఈ ఫైబ్రాయిడ్లు అనేవి కొమ్మ లాంటి పెరుగుదలలు, ఇవి గర్భాశయ గోడకు ఇరుకుగా సంబంధం కలిగి ఉంటాయి. ఇవి గర్భాశయం వెలుపల మరియు లోపల కూడా పెరుగుతాయి. ఇవి పెరుగుదల స్థానాన్ని బట్టి మరింతగా వర్గీకరించబడ్డాయి:

  • పెడన్క్యులేటెడ్ సబ్‌మ్యుకోసల్ ఫైబ్రాయిడ్లు - ఇవి గర్భాశయ గోడ యొక్క బయటి కండరాలపై కొమ్మ లాంటి పెరుగుదల చూపిస్తుంది.
  • పెడన్క్యులేటెడ్ సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్లు - ఇవి గర్భాశయ కుహరంలో కొమ్మ లాంటి పెరుగుదలలు , ఇవి నేరుగా గర్భాశయ లోపలి పొరకు దిగువన ఉంటాయి.


5. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వారపు) ఫైబ్రాయిడ్లు 

సర్వైకల్ (గర్భాశయ ముఖద్వారపు) ఫైబ్రాయిడ్లు గర్భాశయం యొక్క నిరపాయమైన (క్యాన్సర్ కాని) పెరుగుదలలు. ఇవి గర్భాశయ ముఖద్వారంలో అభివృద్ధి చెందుతాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్‌ల రకాలలో ఇది ఒక అరుదైన రకం, మరియు ఇది రుతుక్రమంలో ఎక్కువ రక్తస్రావాన్ని కలుగజేయడం, రక్తం గడ్డలు కట్టడం, రక్తహీనత, కటి ప్రాంతంలో నొప్పి లేదా వెన్నునొప్పి, తరచుగా మూత్రవిసర్జనను కలిగించడం వంటి లక్షణాలను కలిగిస్తుంది.


6. బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్లు

బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్లు నిరపాయమైన కండర పెరుగుదలలు , ఇవి మృదు కండరం లేదా గర్భాశయ మృదు కండరం యొక్క హార్మోన్ (వినాళగ్రంధుల స్రావము) సున్నితత్వం వల్ల అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా, బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ అనేది గర్భాశయ ఫైబ్రాయిడ్ల యొక్క అరుదైన రకం, అయితే పెల్విక్ (కటి) ప్రాంతంలో దీర్ఘకాలిక నొప్పి, మూత్రాశయ కుదింపు మరియు ప్రేగు పనిచేయకపోవడం వంటి లక్షణాలను కలుగజేస్తుంది.


మృదువైన కండరాల కణాలు మరియు ఫైబ్రోబ్లాస్ట్‌లు అసాధారణంగా పెరిగి ఫైబ్రాయిడ్‌లకు దారితీస్తాయి. ఫైబ్రాయిడ్లు కటి భాగము నుండి దిగువ పొత్తికడుపులోకి మరియు కొన్ని సందర్భాల్లో పై పొత్తికడుపులోకి వ్యాపిస్తాయి. ప్రత్యామ్నాయంగా, అవి మైయోమెట్రియం నుండి పొడుచుకు వచ్చి గర్భాశయంలోకి ప్రవేశించవచ్చు.



గర్భాశయ ద్రవ్యరాశి (కణ రాశి)ని సాధారణ ఫైబ్రాయిడా లేదా క్యాన్సర్ కనితా అని చెప్పడం అప్పుడప్పుడు సవాలుగా ఉంటుంది. ఎందుకనగా ఇవి క్యాన్సర్తో సంబంధం ఉన్నవి కావు మరియు క్యాన్సర్గా మారడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఫైబ్రాయిడ్లు బఠానీ పరిమాణం నుండి పుచ్చకాయ పరిమాణం వరకూ ఉంటాయి. సాధారణంగా గర్భాశయ ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కానప్పటికీ, అవి బాధాకరమైనవి, మరియు అప్పుడప్పుడు ఎర్ర రక్త కణాల తగ్గుదల (రక్తహీనత) వంటి సమస్యలకు దారితీయవచ్చు. గణనీయమైన రక్త నష్టం కారణంగా ఇది అలసటకు కారణమవుతుంది. రక్తాన్ని కోల్పోయిన వాళ్ళలో అరుదుగా రక్త మార్పిడి అవసరం పడవచ్చు.

Uterine fibroids meaning in telugu | types of uterine fibroids in telugu | uterine fibroids pictures images | uterine fibroid classification in telugu | intramural uterine fibroid | subserosal uterine fibroid

గర్భాశయ ఫైబ్రాయిడ్ల వ్యాప్తి

Prevalence of Uterine Fibroids in Telugu


దాదాపు 20-80% మంది స్త్రీలలో 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఫైబ్రాయిడ్‌లు అభివృద్ధి చెందుతున్నాయి. ఫైబ్రాయిడ్లు ఉన్న స్త్రీలు ఎక్కువ మంది సాధారణంగా 40 నుండి 50 వయస్కుల మధ్యవారు. ఫైబ్రాయిడ్ ప్రభావిత స్త్రీలందరూ లక్షణాలను అనుభవించరు. లక్షణాలను అనుభవించే స్త్రీలలో ఫైబ్రాయిడ్లను ఎదుర్కోవడం కష్టంగా ఉండవచ్చు.



నివేదికల ప్రకారం, భారత దేశంలో, నగరాల్లో ఉంటున్న వారిలో 24% మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారిలో 37.65% మంది ప్రజలలో ఫైబ్రాయిడ్స్ అభివృద్ధి చెందాయి. భారతదేశంలో సంవత్సరానికి పది లక్షల కంటే ఎక్కువ గర్భాశయ ఫైబ్రాయిడ్‌ల సంఘటనలు కనిపిస్తున్నాయి. దాని యొక్క సంభవం ఈ క్రింది విధంగా ఉంది:

వయస్సు 15-25 సంవత్సరాలు 26-35 సంవత్సరాలు 36-45 సంవత్సరాలు >45 సంవత్సరాలు
సంఘటనలు 0.8% 21.6% 33.9% 43.6%

గర్భాశయ ఫైబ్రాయిడ్ల సంకేతాలు మరియు లక్షణాలు

Uterine fibroid symptoms in Telugu


గర్భాశయ ఫైబ్రాయిడ్ల యొక్క లక్షణాలు చాలా మంది రోగులలో కనిపించవు (లక్షణరహితమైనవి) కానీ సాధారణంగా గర్భాశయ ఫైబ్రాయిడ్ల లక్షణాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:

  • దీర్ఘకాలపు లేదా భారీ ఋతు స్రావం (మెనోర్హ్హేజియా) అనేది అత్యంత సాధారణ లక్షణం
  • కటి ప్రదేశంలో ఒత్తిడి లేదా నొప్పి - ఈ లక్షణం ఉన్నపుడు దీనిని పెద్ద ఫైబ్రాయిడ్‌లుగా అనుమానించవచ్చు
  • కటి ప్రదేశంలో అసౌకర్యం లేదా నడుము క్రింది భాగములో నొప్పి
  • బాధాకరమైన (నొప్పి తో కూడిన) సంభోగం (డిస్పేరూనియా)
  • మూత్రం తరచుదనం, మూత్రం ఆవశ్యకత, మూత్రం నిలుపుదల వంటి మూత్ర లక్షణాలు
  • మలబద్ధకం (ప్రేగుల నుండి మలాన్ని విసర్జించడంలో ఇబ్బంది, సాధారణంగా గట్టిపడిన మలంతో సంబంధం కలిగి ఉంటుంది)
  • పునరావృత (మళ్లి వచ్చే) గర్భస్రావం, అకాల ప్రసవం, గర్భస్థ శిశువు యొక్క అసాధారణ స్థానం, సిజేరియన్ డెలివరీ మరియు ప్లాసెంటల్ అబ్రప్షన్ (గర్భాశయంలోని పొర దెబ్బతినడం) వంటి ప్రసవ సమస్యలు 
  • సంతానలేమి
uterine fibroid symptoms in telugu | signs and symptoms of uterine fibroids in telugu | small and large uterine fibroid symptoms in telugu | symptoms of uterine fibroids and polyps in telugu

అపాయింట్‌మెంట్ కోసం

గర్భాశయ ఫైబ్రాయిడ్లను కలుగచేసే కారణాలు 

Uterine fibroid causes in Telugu


గర్భాశయ ఫైబ్రాయిడ్స్ రావడానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియవు. ఫైబ్రాయిడ్స్‌ అనేవి పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా మొదటి ఋతుస్రావం లేని యువ స్త్రీల లో ఇవి గమనించబడవు (మెనార్చే). పరిశోధన మరియు క్లినికల్ డేటా ఆధారంగా, గర్భాశయ ఫైబ్రాయిడ్లు అభివృద్ధి చెందడానికి కొన్ని కారకాలు ఉన్నాయి, అవి ఏమిటనగా:

  • ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల అసమతుల్యత
  • జన్యుపరమైన మార్పులు (జన్యు ఉత్పరివర్తనలు)
  • ఇతర ఇన్సులిన్ లాంటి వృద్ధి (పెరుగుదల) కారకాలు
  • పెరిగిన ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ (ECM)

గర్భాశయ ఫైబ్రాయిడ్స్‌ రావడానికి గల ప్రమాద కారకాలు 

Risk factors for uterine fibroids in Telugu


స్త్రీలలో గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లను అభివృద్ధిని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి, అవి ఏమిటనగా:

  • ఊబకాయం
  • ప్రారంభ రుతుక్రమం (మొదటి సంభవం)
  • శూన్యత-సంతానోత్పత్తి కాని స్త్రీ (ఇప్పటి వరకు గర్భం దాల్చని స్త్రీలు)
  • విటమిన్ డి లోపం (హైపోవిటమినోసిస్ డి)
  • రుతువిరతి ఆలస్యంగా రావటం (ఆలస్యమైన రుతు విరామం)
  • అధిక రక్తపోటు 
  • కుటుంబంలోని వారికి గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఉండటం


అత్యంత ముఖ్యమైన ప్రమాద సూచికలు అనేవి అధిక మొత్తంలో అంతర్జనిత ఈస్ట్రోజెన్‌ను బహిర్గతం చేయడానికి దోహదపడతాయి.

గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వల్ల కలిగే సమస్యలు

Complications of uterine fibroids in Telugu


ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో ఫైబ్రాయిడ్లు అత్యంత ప్రబలమైన కణితి అయినప్పటికీ, వాటి నుండి తీవ్రమైన సమస్యలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే, అవి సంభవించినప్పుడు, తీవ్రమైన సమస్యలు స్త్రీ యొక్క జీవన నాణ్యతపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, ఇవి గణనీయమైన అనారోగ్యాలను మరియు మరణాలను చాలా అరుదుగా కలిగిస్తాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే కొన్ని సంక్లిష్టతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • థ్రోంబోఎంబోలిజం (రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళాన్ని అడ్డుకోవడం)
  • మలబద్ధకం 
  • స్త్రీ పునరుత్పత్తి అవయవాలు వక్రీకరించబడటం (ఆడ వారి అవయవాలు మెలితిప్పబడటం లేదా అణిచివేయబడటం)
  • రక్త ప్రసరణలో అంతరాయం, ఇది గర్భధారణ సమస్యలకు దారితీస్తుంది
  • సంతానలేమి-సంతానోత్పత్తి లేకపోవడం
  • గర్భధారణ సమయంలో రెడ్ డీజెనెరేషన్ (ఫైబ్రాయిడ్ మెలితిప్పబడటం)


రెడ్ డీజెనెరేషన్: గర్భధారణ సమయంలో రెడ్ డీజెనెరేషన్ అనేది తీవ్రమైన సమస్యలలో ఒకటి, దీనిలో సబ్‌సెరోసల్ పెడన్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్ మెలితిరగడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు:

  • తీవ్రమైన మూత్రవిసర్జన నిలుపుదల (మూత్ర విసర్జనలో ఇబ్బంది)
  • తీవ్ర మూత్రపిండాల వైఫల్యం (మూత్రపిండ వైఫల్యం)
  • తీవ్రమైన యోని లేదా ఇంట్రా-పెరిటోనియల్ (అంతర్-కడుపు) రక్తస్రావం (యోని వద్ద అంతర్గత రక్తస్రావం)
  • మెసెంటెరిక్ సిరలో రక్తం గడ్డకట్టడం (సిరలో గడ్డకట్టడం)
  • పేగు గ్యాంగ్రీన్ (ప్రేగులకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి, ప్రేగులు చనిపోవడం)


పెద్ద, స్థూలమైన యాంటీరియర్ (పూర్వ)ఫైబ్రాయిడ్స్ ఇవి సాధారణంగా పొత్తికడుపు మీద ఒత్తిడి మరియు మూత్రాశయ లక్షణాలను కలిగిస్తాయి, అయితే పోస్టీరియర్ (పృష్ఠ ) ఫైబ్రాయిడ్స్ అనేవి మలబద్ధకానికి దారితీయవచ్చు.


సంతానోత్పత్తిపై గర్భాశయ ఫైబ్రాయిడ్ల యొక్క ప్రతికూల ప్రభావాలు అనేవి కొన్నిటిని నిరోధించడం ద్వారా బాగా ప్రభావితమవుతాయి. అవి ఏమనగా ఫైబ్రాయిడ్ యొక్క స్థానం, అడ్నెక్సల్ అనాటమీ (అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు మరియు స్త్రీ పునరుత్పత్తి అవయవాలను భద్రపరిచే స్నాయువులు), సాధారణ గర్భాశయాన్ని వక్రీకరించే సామర్థ్యం. ఇవి ముఖ్యంగా స్పెర్మటోజోవా రవాణా, పిండం అమరిక మరియు/లేదా ప్రారంభ గర్భం యొక్క నిర్వహణను అడ్డుకుంటాయి.


దీర్ఘకాలిక శోథకు దారితీసే బలహీనమైన రక్త ప్రసరణ అనేది ఫైబ్రాయిడ్‌ల వల్ల సంభవించే మరొక సమస్య, ఇది ఎండోమెట్రియల్ (గర్భాశయ పొర) యొక్క స్వీకరించే సామర్థ్యాన్ని మారుస్తుంది, తద్వారా గర్భాశయలో గర్భం యొక్క మనుగడకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Uterine fibroids diagnosis in Telugu


సాధారణ కటి పరీక్ష సమయంలో, ఫైబ్రాయిడ్‌లు మొదటిసారిగా గుర్తించబడవచ్చు. అయినప్పటికీ, ఫైబ్రాయిడ్ల గురించి మరింత ఖచ్చితంగా వెల్లడించే అనేక పరీక్షలు ఉన్నాయి. చికిత్స ప్రారంభించే ముందు ఫైబ్రాయిడ్ల రకాన్ని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ ఈ క్రింది రోగనిర్ధారణ ప్రక్రియలో కొన్నింటిని నిర్వహించవచ్చు:

  • రక్త పరీక్షలు
  • రేడియాలజీ పరీక్ష (ఉదరం మరియు పెల్విస్ యొక్క అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌ వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ)
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT)
  • మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)
  • హిస్టెరోస్కోపీ
  • హిస్టెరోసల్పింగోగ్రఫీ
  • సోనోహిస్టెరోగ్రామ్
  • లాపరోస్కోపీ

గర్భాశయ ఫైబ్రాయిడ్ల నివారణ

Uterine fibroids prevention in Telugu


గర్భాశయ ఫైబ్రాయిడ్‌లకు ఖచ్చితమైన నివారణ లేదు, ఎందుకంటే వాటికి ఖచ్చితమైన కారణాలు తెలియవు. అయినప్పటికీ, వైద్య పరిశోధన అనేది గర్భాశయ ఫైబ్రాయిడ్‌ల నివారణలో వివిధ దశలను వెలుగు లోకి తీసుకొని వచ్చింది.

  • కొంతమంది మహిళల్లో ప్రమాదం పెరగడానికి అధిక చక్కెర ఆహారాలు అని ఒక అధ్యయనం ప్రదర్శించింది.
  • ఒక అధ్యయనం ప్రకారం, బ్రోకలీ, అరుగులా, క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు టర్నిప్‌ వంటి తాజా ఉత్పత్తులు గర్భాశయ ఫైబ్రాయిడ్‌లను కలుగ చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఈ కూరగాయలు బీటా-కెరోటిన్, ఫోలియేట్, ఫైబర్, విటమిన్లు సి, ఇ మరియు కె, అలాగే ఇతర పోషకాలు మరియు ఖనిజాలతో పుష్కలంగా ఉన్నాయి.
  • గర్భాశయ ఫైబ్రాయిడ్‌లు వచ్చే ప్రమాదం ఒత్తిడి లేని జీవనశైలిని అవలంబించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడు తక్కువగా ఉంటుంది.
  • గర్భాశయ ఫైబ్రాయిడ్‌లను నివారించడం లో ఐరన్, మెగ్నీషియం వంటి సప్లిమెంట్స్ బాగా సహాయపడతాయి.

Uterine fibroids treatment in Telugu


చాలా సందర్భాలలో వీటికి చికిత్స అవసరం పడదు. చికిత్స అనేది సాధారణంగా శస్త్రచికిత్సకు సంబంధించినది. రోగులు సర్జరీని వాయిదా వేయాలనుకుంటే సాధారణంగా ఔషధ ఎంపికలు సూచించబడతాయి.

కడుపు నొప్పి మరియు రక్తస్రావం వంటి లక్షణాల చికిత్సకు ఉపయోగించే మందులు:

  • నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు)
  • యాంటీఫైబ్రినోలైటిక్స్
  • గోనాడోట్రోపిన్ విడుదల చేసే హార్మోన్ అగోనిస్ట్‌ (GnRHa) మందులు
  • విటమిన్ మరియు ఐరన్ సప్లిమెంట్స్
  • ప్రొజెస్టిన్ను -విడుదల చేసే గర్భాశయ పరికరం (IUD)


గర్భాశయ ఫైబ్రాయిడ్ల కోసం శస్త్రచికిత్స ఎంపికలు:

  • గర్భాశయ ధమని యొక్క ఎంబోలైజేషన్
  • రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్
  • హిస్టెరోస్కోపిక్ మైయోమెక్టోమీ
  • ఎండోమెట్రియల్ అబ్లేషన్
  • మైయోలిసిస్
  • మైయోమెక్టమీ - ఓపెన్, లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్
  • ఉదర మయోమెక్టమీ లేదా లాపరోటమీ
  • టోటల్ హిస్టెరెక్టమీ - ఓపెన్, లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్
గర్భాశయ ఫైబ్రాయిడ్ల నిర్ధారణ మరియు చికిత్స

అపాయింట్‌మెంట్ కోసం

గర్భాశయ ఫైబ్రాయిడ్లపై తరచుగా అడిగే ప్రశ్నలు


గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కాలక్రమేణా వాటంతట అవే తగ్గుతాయా?

కొన్ని గర్భాశయ ఫైబ్రాయిడ్స్ సంతానోత్పత్తి సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ, మరికొన్ని చాలా సంవత్సరాలుగా పరిమాణాన్ని మార్చవు. ఋతువిరతి తర్వాత, అన్ని ఫైబ్రాయిడ్స్ సాధారణంగా విస్తరించడం ఆగిపోతాయి. ఋతువిరతి (మెనోపాజ్) తర్వాత కూడా ఫైబ్రాయిడ్స్ పెరిగే స్త్రీలు రోగ నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించాలి.

ఏ రకమైన ఫైబ్రాయిడ్లు అబార్షన్లకు కారణమవుతాయి?

అన్ని రకాల ఫైబ్రాయిడ్‌లు అబార్షన్‌లకు కారణమవుతాయి, కానీ ముఖ్యంగా సబ్‌ముకోసల్ ఫైబ్రాయిడ్‌లు ఎక్కువగా కారణమవుతాయి.

ఫైబ్రాయిడ్‌లు అనుకొని పొరపడే ఇతర గర్భాశయ వ్యాధులు ఏమిటి?

గర్భాశయ ఫైబ్రాయిడ్‌లకు దారితీయగల మరియు అటువంటి లక్షణాలను కలిగి ఉండే వివిధ పరిస్థితులు ఈ క్రింది ఉన్నాయి, అవి ఏమిటనగా:

  • అడెనోమియోసిస్ (ఎండోమెట్రియం గర్భాశయ గోడలోకి పెరుగుతుంది)
  • ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం లోపలి పొర అయిన ఎండోమెట్రియం యొక్క వాపు),
  • లియోమియోసార్కోమా (గర్భాశయ కండరాల గోడలో పెరిగే అరుదైన క్యాన్సర్ రకం),
  • ఎండోమెట్రియల్ కార్సినోమా (ఎండోమెట్రియంలో ఉద్భవించే క్యాన్సర్)

గర్భాశయ ఫైబ్రాయిడ్ల సమస్య అనేది ఎండోమెట్రియం గట్టిపడటానికి కారణమవుతుందా?

అవును, గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ అనేవి ఎండోమెట్రియం గట్టిపడటాన్ని ప్రేరేపించే పరిస్థితుల్లో ఒకటి. మందపాటి ఎండోమెట్రియం ఈ క్రింది వ్యాధులకు కారణమవుతుంది:

  • ఋతుక్రమాల మధ్య రక్తస్రావం
  • తీవ్రమైన రుతుక్రమ నొప్పి
  • 24 రోజుల కంటే తక్కువ లేదా 38 రోజుల కంటే ఎక్కువగా ఉండే ఋతు చక్రాలు
  • ఋతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం మొదలైనవి

గర్భాశయ పాలిప్స్ మరియు ఫైబ్రాయిడ్లు ఒకేలా ఉంటాయా?

లేదు, అవి ఒకేలా ఉండవు. ఫైబ్రాయిడ్లు మరియు పాలిప్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం అవి అభివృద్ధి చెందే కణజాలంలో ఉంటుంది - అయితే ఫైబ్రాయిడ్‌లు అనేవి కండరాల కణాలు మరియు బంధన కణజాలాలతో తయారవుతాయి, అలాగే పాలిప్స్ అనేవి గర్భాశయంలోని ఎండోమెట్రియల్ (గర్భాశయం లోని లోపలి పొర) కణజాలం నుండి వచ్చాయి. గర్భాశయ పాలిప్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి మరియు అవి క్యాన్సర్, అసాధారణ ఋతు చక్రం, యోని రక్తస్రావం మరియు మూత్రాశయ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్థాయి.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) సమస్య గర్భాశయ ఫైబ్రాయిడ్‌లకు కారణమవుతుందా?

23,000 మంది ప్రసవ రాని (ప్రీ-మెనోపాజ్) ఆఫ్రికన్, అమెరికన్ మహిళలపై విశ్లేషించిన ఒక అధ్యయనం ప్రకారం, PCOSతో బాధపడుతున్న మహిళల్లో PCOS లేని మహిళల కంటే 65% ఎక్కువ ఫైబ్రాయిడ్లను కలిగి ఉన్నారని తేలింది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు గర్భధారణ లక్షణాలను కలిగిస్తాయా?

లేదు,గర్భాశయ ఫైబ్రాయిడ్లు గర్భధారణ లక్షణాలను కలుగచేయవు. గర్భాశయ ఫైబ్రాయిడ్లు మరియు గర్భం యొక్క లక్షణాలు ఎక్కువగా అతివ్యాప్తి చెందవు (కలవవు).

గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఎంత వేగంగా పెరుగుతాయి?

ఫైబ్రాయిడ్‌ల సగటు పెరుగుదల రేటు 3 నెలలకు గాను సుమారు 7%, ఇది నెలకు దాదాపు 1 మి.మీ. పెరగవచ్చు.

కాల్సిఫైడ్ యుటెరైన్ ఫైబ్రాయిడ్ అంటే ఏమిటి?

గర్భాశయ ఫైబ్రాయిడ్‌లు పరిమాణంలో పెరిగే కొద్దీ, అవి రక్త సరఫరాను మించిపోతాయి ( అధిగమించి ) వివిధ క్షీణత మార్పులను ప్రేరేపిస్తాయి మరియు కాల్షియం నిక్షేపణ అటువంటి అరుదైన క్షీణతలో ఒకటి. ఇది ప్రధానంగా ఋతుక్రమం ఆగిపోయిన వయస్సు గల మహిళల్లో కనిపిస్తుంది. ఫైబ్రాయిడ్‌లో రక్త సరఫరా బలహీనపడటం వల్ల ఈ క్షీణత లాంటి మార్పులు సంభవిస్తాయి.

మెనోపాజ్ తర్వాత గర్భాశయ ఫైబ్రాయిడ్లు పెరగడానికి కారణం ఏమిటి?

సాధారణంగా, మెనోపాజ్ (రుతువిరతి) దశలో ఈస్ట్రోజెన్ స్టిమ్యులేషన్ లేకపోవడంతో గర్భాశయ ఫైబ్రాయిడ్‌లు తగ్గడం కనిపిస్తుంది. అయినప్పటికీ, రుతుక్రమం ఆగిపోయిన వయస్సులో గర్భాశయ ఫైబ్రాయిడ్ల పెరుగుదలను వివిధ కారకాలు కొన్నిసార్లు ప్రేరేపించవచ్చని సూచించబడింది. ఇది స్థూలకాయంతో బాధపడుతున్న మెనోపాజ్ మహిళల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

Breast Cancer Symptoms, Causes, Types, Stages & Treatment in Telugu | Breast Cancer in Telugu
By PACE Hospitals October 29, 2025
రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ములో ఏర్పడే తీవ్రమైన వ్యాధి. దీని లక్షణాలు, కారణాలు, దశలు, నిర్ధారణ, చికిత్స మరియు నివారణ పద్ధతులను వివరంగా తెలుసుకోండి.
Kidney stone Doctor in Hyderabad | best doctor for kidney stone in Hyderabad
By PACE Hospitals October 29, 2025
Consult the best kidney stone specialist in Hyderabad at PACE Hospitals for accurate diagnosis, advanced kidney stone treatment, and trusted long-term care.
Best doctor for liver cirrhosis in India | liver cirrhosis specialist in Hyderabad
By PACE Hospitals October 28, 2025
Consult the best liver cirrhosis specialist in Hyderabad at PACE Hospitals for accurate diagnosis, advanced treatments and therapies, and trusted long-term liver care.
World Psoriasis Day 29 October 2025 - Importance, Theme & History | World Psoriasis Day
By PACE Hospitals October 28, 2025
World Psoriasis Day 2025 raises awareness about psoriasis and skin health. Discover its theme, history, and why global support and understanding matter.
World Stroke Day 29 October 2025 - Theme, History and Importance | World Stroke Day
By PACE Hospitals October 28, 2025
World Stroke Day 2025 spreads global awareness about stroke. Discover its theme, history, and importance of early detection and prevention.
best piles doctor in hyderabad | piles specialist in hyderabad | piles doctor near me
By PACE Hospitals October 27, 2025
Consult the best piles doctor in Hyderabad at PACE Hospitals for accurate diagnosis, personalised care, and advanced treatment for all types of piles and related conditions.