డయాబెటిస్ - లక్షణాలు, రకాలు, కారణాలు, ప్రమాద కారకాలు, సమస్యలు, రోగ నిర్ధారణ & చికిత్స
Diabetes meaning in Telugu
డయాబెటిస్ అనేదిఅక్యూట్(కొద్దిపాటి కాలం) లేదా దీర్ఘకాలికంగావచ్చేవంశపారంపర్య లేదాస్వీయ అభివృద్ధి వ్యాధి. ఇది మూత్రపిండాల ద్వారా అదనపు మూత్రంరావడానికి దారితీస్తుంది.మూత్రంలో గ్లూకోజ్ ఉనికినిబట్టిడయాబెటిస్ అనేది రెండు రకాలుగా వర్గీకరించబడింది.
"డయాబెటిస్" అనే పదం ప్రాచీన గ్రీస్ నాటిది; దాని అర్థం "గుండా వెళ్ళు". "మెల్లిటస్" అనేది లాటిన్ పేరు; దాని అర్థం, "తేనె లేదా తీపి," గా చెప్తారు. కావున, డయాబెటిస్ మెల్లిటస్ అంటే మూత్రంలో గ్లూకోజ్ మోతాదు పెరగడం ద్వారా ఏర్పడే పరిస్థితి.డయాబెటిస్ ఇన్సిపిడస్ విషయంలో, "ఇన్సిపిడస్" అనే పదం "రుచి లేనిది(షుగర్ లెస్), "అందువల్ల, ఇది గ్లూకోజ్ లేని మూత్రంగా అభివర్ణించవచ్చు.

డయాబెటిస్ రకాలు
Types of diabetes in Telugu
పైన చెప్పినట్లుగా, మూత్రంలో గ్లూకోజ్ ఉనికిని బట్టి, ఇవి రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి:
- డయాబెటిస్ మెల్లిటస్
- డయాబెటిస్ ఇన్సిపిడస్
డయాబెటిస్ మెల్లిటస్
Diabetes mellitus meaning in Telugu
డయాబెటిస్ మెల్లిటస్ అనేది హైపర్గ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం) ద్వారా వర్గీకరించబడిన జీవక్రియ రుగ్మతల సమితి. శరీరంలో ఇన్సులిన్ స్రావం తగ్గడం,బలహీనమైన గ్లూకోజ్ వినియోగం మరియు గ్లూకోజ్ ఉత్పత్తి పెరగడం వల్ల హైపర్గ్లైసీమియా సంభవిస్తుంది, ఇవన్నీ డయాబెటిస్ మెల్లిటస్‌కు మూలకారకాలు. జన్యు మరియు పర్యావరణ కారకాలు కూడా వివిధ డయాబెటిస్ మెల్లిటస్ రూపాలకు కారణమవుతాయి.
డయాబెటిస్ మెల్లిటస్ యొక్క రకాలు
Types of diabetes mellitus in Telugu
డయాబెటిస్ మెల్లిటస్ రకాలు, హైపర్గ్లైసీమియాకు దారితీసే వ్యాధికారకలుపై ఆధారపడి ఉంటాయి.అవి ఈ క్రింది విదంగా ఉంటాయి:
- టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్
- టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్
- గర్భధారణ మధుమేహం
- వారసత్వంగా పొందిన లోపాలు (బీటా సెల్ అభివృద్ధి మరియు ఇన్సులిన్ చర్యఅసాధారణతలు)
- ట్రాన్సియెంట్ నియోనాటల్ డయాబెటిస్ మెల్లిటస్
- ఎండోక్రైనోపతి
- డయాబెటిస్ మెల్లిటస్ అనుబంధిత అంటువ్యాధులు
- ఔషధ ప్రేరేపితమధుమేహం
- రోగనిరోధక-మధ్యవర్తితమధుమేహం
- ఇతర వారసత్వవ్యాధులు
డయాబెటిస్ ఇన్సిపిడస్
Diabetes insipidus meaning in Telugu
డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది అరుదైన వంశపారంపర్య రుగ్మత. ఈ వ్యాధి కలిగి ఉన్నవారు అధిక మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు.ఈ వ్యాధి ఉన్నవారికి, పాలీయూరియా (తరచుగా మూత్రవిసర్జన) మరియు పాలీడిప్సియాను (విపరీతమైన దాహం) కలిగి ఉంటారు. డయాబెటిస్ ఇన్సిపిడస్ ఉన్నవారు తరచుగా రోజూ 15 నుండి 19 లీటర్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు. దీనికి విరుద్ధంగా, ఆరోగ్యకరమైన వ్యక్తులు సాధారణంగా రోజుకు 2 మరియు 3 లీటర్ల మధ్య మూత్ర విసర్జన చేస్తారు.
డయాబెటిస్ ఇన్సిపిడస్ రకాలు
Types of diabetes insipidus in Telugu
డయాబెటిస్ ఇన్సిపిడస్ రకాలుఅనేవి యాంటీ-డ్యూరెటిక్ హార్మోన్(ADH) ఉత్పత్తి తగ్గడం లేదా మూత్రపిండాల కణాలకు దాని బంధన అసాధారణతపై ఆధారపడి ఉంటాయి.ఇవి నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి:
- సెంట్రల్ డయాబెటిస్ ఇన్సిపిడస్
- నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్
- జెస్టేషనల్డయాబెటిస్ ఇన్సిపిడస్
- డిప్సోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్ లేదా సైకోజెనిక్ పాలీడిప్సియా
భారతదేశంలో మధుమేహంయొక్కప్రాబల్యం
భారతదేశంలో డయాబెటిస్ మెల్లిటస్యొక్క ప్రాబల్యం అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోని డయాబెటిస్ హబ్‌గా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మధుమేహంతో భాదపడుతున్న రోగులలో, 17%శాతం మందిభారతదేశంలో కలిగి ఉన్నారు.2019లో, భారతదేశంలో మధుమేహం దాదాపు 7.7 కోట్ల మందిని ప్రభావితం చేసిందిగాఒక అధ్యయనంలో నివేదించబడింది; 2045 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDల) నివేదిక ప్రకారం, 2019లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు సంబంధించిన టాప్ 10 ప్రధాన కారణాలలో డయాబెటిస్ మెల్లిటస్ తొమ్మిదవ స్థానంలో ఉంది.
డయాబెటిస్ ఇన్సిపిడస్ భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా సంభవిస్తుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా 25,000 మందిలో ఒక్కర్ని ప్రభావితం చేస్తుంది.
డయాబెటిస్ యొక్క కారణాలు
Diabetes causes in Telugu

డయాబెటిస్ మెల్లిటస్ యొక్క కారణాలు
Diabetes mellitus causes in Telugu
ప్యాంక్రియాస్‌లో బీటా మరియు ఆల్ఫాఎండోక్రైన్ కణాలుఉంటాయి. బీటా కణాలునుండి ఇన్సులిన్ హార్మోన్, మరియు ఆల్ఫా కణాల నుండి గ్లూకాగాన్ హార్మోన్ స్రవిస్తాయి. ఈ బీటా మరియు ఆల్ఫా కణాలు రెండూ వాటి పరిసర రక్తంలో గ్లూకోజ్ సాంద్రతకు ప్రతిస్పందనగా వాటి హార్మోన్ విడుదల స్థాయిలను సర్దుబాటు చేసి రక్తంలో సాధారణ గ్లూకోజ్ స్థాయిలను నిర్వహిస్తాయి.
సాధారణ పరిస్థితుల్లో, రక్తంలో గ్లూకోజ్ సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు, బీటా కణాలు ఎక్కువ ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. రక్తంలో తక్కువగ్లూకోజ్ ఉన్న పరిస్థితుల్లో, ఆల్ఫా కణాల నుండి గ్లూకోగాన్ అధికంగా విడుదల అవుతుంది.
డయాబెటిస్ మెల్లిటస్ ప్రధానంగా హైపర్గ్లైసీమియా (రక్తములో చక్కెర స్థాయిలు అధికముగా ఉండడం) వలన సంభవిస్తుంది, ఇది తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ద్వారా (టైప్ 1 డయాబెటిస్), లేదా ఇన్సులిన్ నిరోధకత చర్య తగ్గడం(టైప్ 2 డయాబెటిస్) కారణంగా సంభవిస్తుంది.
ప్యాంక్రియాస్ లో, స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన (తెలియకుండా రోగ నిరోధక వ్యవస్థ స్వంత కణాలపై దాడి చేయడం) వల్ల బీటా కణాలకు నష్టం జరుగుతుంది.తద్వారా, శరీరంలోని బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తీవ్రంగా పడిపోతాయి.ఇదిఫలితంగా టైప్ 1 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
టైప్ 2 డయాబెటిస్‌లో,ఇన్సులిన్ స్థాయిలు మరియుకండరాలుయొక్కకణాలతో ఇన్సులిన్ యొక్క ప్రతిస్పందనమధ్య మార్పు వల్ల ఇన్సులిన్ నిరోధకత వస్తుంది.ఇన్సులిన్ నిరోధకత సంక్లిష్టమైనది; అయినప్పటికీ, ఇది పెరిగిన శరీర బరువు మరియు వయసు పెరుగుదల వల్ల కూడా వస్తుంది.

డయాబెటిస్ ఇన్సిపిడస్ యొక్క కారణాలు
Diabetes insipidus causes in Telugu
డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది పిట్యూటరీ గ్రంధి నుండి అర్జినైన్ వాసోప్రెస్సిన్ (యాంటీ-డైయూరెటిక్ హార్మోన్ల) యొక్క బలహీనమైన స్రావం లేదా అర్జినిన్ వాసోప్రెసిన్‌కు తగినంత మూత్రపిండముప్రతిస్పందన లేకపోవడం వల్ల, పాలీయూరియా (ఎక్కువ సార్ల మూత్రవిసర్జన) మరియు పాలీడిప్సియాను (ఎక్కువ దాహంవేయడం) కలిగిఉంటుంది.
పిట్యూటరీ గ్రంధి నుండి విడుదలయ్యే యాంటీ-డైయూరెటిక్ హార్మోన్ లేదా వాసోప్రెస్సిన్మూత్రపిండానికిచేరుకుంటుంది. ఇదిమూత్రపిండంలోని అర్జినైన్ వాసోప్రెస్సిన్ రిసెప్టర్ 2 (AVPR2)తో కలుస్తుంది. ఈAVPR2, మూత్రపిండము నుండి రక్తప్రవాహంలోకి నీటిని (పునశ్శోషణం) బదిలీ చేయడాన్ని ప్రేరేపిస్తుంది.అదేవిదంగా రక్త సాంద్రతను (ఓస్మోలాలిటీ) నిర్వహిస్తుంది. శోషించబడని వ్యర్థాలు, మూత్రం నుండి శరీరం ద్వారా బయటికి వెళ్తాయి.
డయాబెటిస్ ఇన్సిపిడస్ లో, పిట్యూటరీ గ్రంధి లో వాసోప్రెస్సిన్ స్రావం తగ్గడం వల్ల (ఇది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల కావచ్చు) లేదా మూత్రపిండాల కణాలకు, విడుదలైన యాంటీ-డ్యూరెటిక్ హార్మోన్తో సంయోగం లేకపోవడంవల్ల మూత్రపిండాల నుండి రక్త నాళాలకు చాలా తక్కువ నీరు తిరిగి గ్రహించబడుతుంది. ఇది మూత్రపిండాలలో అధిక మూత్రం ఏర్పడటానికి కారణమవుతుంది, దీనిని సాధారణంగా పాలీయూరియాఅని అంటారు.
మూత్రపిండ రక్తనాళాలలో తక్కువ మొత్తంలో నీరు ఉండటం వలన (కిడ్నీ నుండి రక్తనాళాలకు తక్కువ మొత్తంలో నీరు వెళ్లడం జరుగుతుంది)తద్వారా రక్త ఆస్మోలాలిటీ మారిపోతుంది.అందువలన, శరీరం సమతుల్యం పొందడానికి ఎక్కువ నీరు అవసరంఅవుతుంది. ఫలితంగా, హైపోథాలమస్‌లోని ఆస్మోరెసెప్టర్లు దాహం యొక్క అనుభూతిని ప్రేరేపిస్తాయి, దీనివల్ల వ్యక్తి ఎక్కువదాహ (పాలిడిప్సియా) అనుభూతిని చెందుతాడు.
డయాబెటిస్ యొక్క లక్షణాలు
Diabetes symptoms in Telugu
డయాబెటిస్ యొక్క ప్రధాన లక్షణాలు అధిక దాహం మరియు అధిక మూత్రవిసర్జన.దీనికి అదనంగా, కొన్నిలక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

పెద్దవారిలో డయాబెటిస్ ఇన్సిపిడస్ లక్షణాలు
- పాలీడిప్సియా (విపరీతమైన దాహం అనిపిస్తుంది)
- నోక్టురియా (తరచుగా అర్ధరాత్రిలోమూత్ర విసర్జన చేయడానికి మేల్కోవడం)
- మూత్రం యొక్క అధిక ఉత్పత్తి
పిల్లలలో డయాబెటిస్ ఇన్సిపిడస్ లక్షణాలు
- రాత్రిపూటమూత్రవిసర్జన ఆధీనంలో లేకపోవడం(ఎన్యూరెసిస్)
- నిద్రపోవడానికి ఇబ్బంది పడడం
- జ్వరం
- మల విసర్జన చేయడంలో ఇబ్బంది
- బరువు తగ్గడం
- పెరుగుదలమందగించడం
- వాంతులు చేసుకోవడం

డయాబెటిస్ మెల్లిటస్ లక్షణాలు
- తరచుగా మూత్ర విసర్జన చేయడం
- కీటోన్యూరియా (మూత్రంలో కీటోన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం)
- మానసిక స్థితిలో మార్పు
- కళ్ళు మసకగా కనబడడం
- బరువు తగ్గడం
- బలహీనతగా ఉండడం
- ఎక్కువగా దాహం కలగడం
- పుండ్లు నెమ్మదిగా నయం అవడం

డయాబెటిస్ వ్యాధికి కారకాలు
Diabetes risk factors in Telugu
డయాబెటిస్ ప్రమాదానికి సంబంధించిన కారకాలు,డయాబెటిస్ రకాన్ని బట్టి మారవచ్చు.అవి ఈ క్రింది విదంగా ఉంటాయి:
డయాబెటిస్ మెల్లిటస్ ప్రమాద కారకాలు
- వారసత్వంగా వచ్చిన ఆటోఆంటిబాడీస్ (కుటుంబం లేదా తల్లిదండ్రులలో ఆటో-యాంటీబాడీస్) ఉండటం వల్ల, టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం)వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
- అధిక బరువు (బాడీ మాస్ ఇండెక్స్ >25 కేజీ/మీ²) లేదా ఊబకాయం (బాడీ మాస్ ఇండెక్స్> 30 కేజీ/మీ²) ఉండటం,టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం) మరియు గర్భధారణ అనేవి మధుమేహానికి ప్రధాన కారకాలు.
- కుటుంబ వైద్య చరిత్రలో (టైప్ 1 మరియు టైప్ 2) డయాబెటిస్ మెల్లిటస్ కలిగి ఉండటం.
- తక్కువ శారీరక శ్రమచేసేవాళ్లు.
- పూర్వ గర్భధారణసమయంలో మధుమేహం కలిగి ఉన్న వారు.
- పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉనికిఅనేది గర్భధారణ మధుమేహానికి ప్రమాద కారకంగా ఉంటుంది.
- 4 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న బిడ్డకు జన్మనివ్వడం.
డయాబెటిస్ ఇన్సిపిడస్ ప్రమాద కారకాలు
నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్ (మూత్రాన్ని కేంద్రీకరించే మూత్రపిండ సామర్థ్యం యొక్క శాశ్వత వైఫల్యం) జన్యువు వారీగామగ శిశువులకు రావచ్చు.
డయాబెటిస్ యొక్క నివారణ
Prevention from diabetes in Telugu
డయాబెటీస్ వంశపారంపర్యంగా లేదా స్వయం ప్రతిరక్షక వ్యాధి నుండి వచ్చినట్లయితే దానిని నివారించలేము. డయాబెటిస్ రకాన్ని బట్టి నివారణ కారకాలు భిన్నంగా ఉంటాయి.
డయాబెటిస్ మెల్లిటస్ నివారణ
ఆటో ఇమ్యూన్ యాంటీబాడీ (టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్) వల్ల ఏర్పడే డయాబెటిస్ మెల్లిటస్, రోగనిరోధక వ్యవస్థ యొక్క అసాధారణ పనితీరు వల్ల సంభవిస్తుంది. దీనిని నివారించడం కష్టం.
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్‌లో, జన్యువు లేదా వంశపారంపర్యంగా-వచ్చిన డయాబెటిస్ మెల్లిటస్ నిరోధించబడదు.అయినప్పటికీ, ఒక వ్యక్తికి ప్రీడయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ యొక్క పురోగతిని తగ్గించడానికి,ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవచ్చు.
- పండ్లు మరియు కూరగాయలతో సహా తక్కువ మోతాదులో ఉన్న కొవ్వు పదార్థాలు (సంతృప్తమైనమరియు ట్రాన్స్-ఫ్యాట్), కార్బోహైడ్రేట్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంసూచించబడుతుంది.
- శారీరక శ్రమను వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు) వ్యాయామ చురుకైన నడక లేదా సైక్లింగ్ వంటివి చేయడం.
- అధిక బరువు లేదా లావుగా ఉన్న వ్యక్తుల విషయంలో శరీర బరువులో 5% నుండి 7% వరకు బరువు తగించుకోవడం.
డయాబెటిస్ ఇన్సిపిడస్ నివారణ
డయాబెటిస్ ఇన్సిపిడస్ నివారణ ప్రధానంగా అంతర్లీన కారణాలను నివారించడంపై ఆధారపడి ఉంటుంది.ఇది నిర్జలీకరణాన్ని నివారించడంవల్లఅదేవిధంగా కొన్ని ఔషధాలను తీసుకోకపోవడం వల్ల,మరియు అంతర్లీన వైద్య సమస్యలను పరిష్కరించడంవల్ల,డయాబెటిస్ ఇన్సిపిడస్ ని నివారించవచ్చు. కారణం అనేది అనిశ్చితంగా ఉన్న సందర్భాల్లో, తరచు పర్యవేక్షణ మరియు లక్షణాలనుతగ్గించడం ద్వారా , డయాబెటిస్ ఇన్సిపిడస్నునివారించవచ్చు.
డయాబెటిస్ మెల్లిటస్ మరియు డయాబెటిస్ ఇన్సిపిడస్ మధ్య వ్యత్యాసం
Diabetes mellitus vs Diabetes insipidus in Telugu
అంశాలు | మధుమేహం | డయాబెటిస్ ఇన్సిపిడస్ |
---|---|---|
నిర్వచనం | రక్తంలో గ్లూకోజ్ స్థాయిల పెరుగుదల ద్వారా వచ్చే జీవక్రియ రుగ్మత. | ఇది అరుదైన జన్యుపరమైన పరిస్థితి, ఇది అధిక మూత్ర ఉత్పత్తి మరియు దాహం యొక్క అనుభూతిని కలిగిస్తుంది. |
కారణాలు | ప్యాంక్రియాటిక్ కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి లోపం లేదా కండరాల కణజాలానికి ఇన్సులిన్ నిరోధకత కారణంగా సంభవించవచ్చు. | మూత్రవిసర్జన వ్యతిరేక హార్మోన్ (ADH) స్థాయిలలో తగ్గుదల లేదా మూత్రపిండాల కణాలకు ADH బంధంలో బలహీనత వలన ఏర్పడుతుంది. |
మూత్రంలో గ్లూకోజ్ | మూత్రంలో గ్లూకోజ్ ఉనికి. | మూత్రంలో గ్లూకోజ్ లేకపోవడం. |
ఆహార నియంత్రణ | చక్కెర, కొవ్వు మరియు ప్రాసెస్ చేసిన మాంసంతో కూడిన ఆహారం. | ఆహారమార్పుల వల్ల డయాబెటిస్ ఇన్సిపిడస్కలగదు. |
సంభవం | అధిక సంభవం కలిగిఉంది. | తక్కువ సంభవం కలిగిఉంది. |

డయాబెటిస్ యొక్క నిర్ధారణ
Diabetes diagnosis in Telugu
డయాబెటిస్ గుర్తించడానికి ఉపయోగించే రోగనిర్ధారణ పరీక్షలు డయాబెటిస్యొక్కరకాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
డయాబెటిస్ మెల్లిటస్ నిర్ధారణ
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) ప్రకారం, డయాబెటిస్ మెల్లిటస్ నిర్ధారణ కిందివాటిలో దేని ద్వారానైనా చేయబడుతుంది:
- గ్లైకోలేటెడ్హిమోగ్లోబిన్ (HbA1c) పరీక్ష
- ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ (FPG)
- ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (OGTT)
- ర్యాండం బ్లడ్ షుగర్ టెస్ట్ (RBS)
డయాబెటిస్ ఇన్సిపిడస్ నిర్ధారణ
డయాబెటిస్ ఇన్సిపిడస్‌ను గుర్తించడానికి ఉపయోగించే రోగనిర్ధారణ పరీక్షలు:
- నీటి కొరత పరీక్ష(వాటర్ డెప్రివేషన్ టెస్ట్)
- మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)
డయాబెటిస్ యొక్క చికిత్స
Diabetes treatment in Telugu
డయాబెటిస్ చికిత్స, వాటి యొక్క అంతర్లీన పరిస్థితులను చికిత్స చేసే దానిపై ఆధారపడిఉంటుంది. వీటిని జీవనశైలి నిర్వహణ మరియు మందుల వాడకంతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, శస్త్రచికిత్స జోక్యం అవసరం కావచ్చు.
డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స
- టైప్ 1 డయాబెటిస్ చికిత్స:టైప్ 1 డయాబెటిస్ చికిత్సలో, రక్తంలో చక్కెర స్థాయిలనుపర్యవేక్షించడం,అలానే భోజనంలో కార్బోహైడ్రేట్ల మోతాదుని తరచుగా పర్యవేక్షించడం మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్ వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, ప్యాంక్రియాస్ లేదా ఐలెట్సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేశస్త్రచికిత్సకూడా సూచించబడుతుంది.
- టైప్ 2 డయాబెటిస్ చికిత్స: ఆహారం మరియు వ్యాయామం, చెక్కెర వ్యాధి పర్యవేక్షణ, జీవనశైలి మార్పులు, నోటి ద్వారా తీసుకొనే డయాబెటిక్ మందులు,ఇన్సులిన్ లేదా రెండింటికలయిక కలిగిన చికిత్సనుఉపయోగిస్తారు.
- డయాబెటిస్ ఇన్సిపిడస్ చికిత్స
- డయాబెటిస్ఇన్సిపిడస్యొక్క చికిత్స దాని యొక్క కారకం ఆధారంగామారుతూ ఉంటుంది.
డయాబెటిస్ ఇన్సిపిడస్ చికిత్స
- ADH హార్మోన్‌ను విడుదల చేసే పిట్యూటరీ గ్రంధిలో ఏదైనా అసాధారణత ఉంటే, అంతర్లీన కారణాన్ని పరిష్కరించాలి.
- వైద్య నిర్వహణలో సింథటిక్ హార్మోన్లు ఉంటాయి, ఇవి యాంటీ-డ్యూరెటిక్ హార్మోన్ (ADH) యొక్క విధులను భర్తీ చేస్తాయి మరియు మూత్రం ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.
- నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్ చికిత్స
- వైద్య నిర్వహణలోథైయాజైడ్డైయూరిటిక్స్మరియు నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీమందులు, మరియు సింథటిక్ హార్మోన్లకలయిక చికిత్స కలిగి ఉంటుంది.
- డీహైడ్రేషన్ నివారించడానికి రోజువారీ నీటిని తీసుకోవడం సూచించబడుతుంది.

డయాబెటిస్ యొక్క సమస్యలు
Diabetes complications in Telugu
డయాబెటిస్ యొక్క సమస్యలు నెమ్మదిగా లేదా స్థితి యొక్క తప్పుడు నిర్ధారణ కారణంగా అభివృద్ధి చెందుతాయి.
డయాబెటిస్ మెల్లిటస్ యొక్క సమస్యలు
దీర్ఘకాలిక డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం) నెమ్మదిగా అభివృద్ధి చెందే సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు మైక్రోవాస్క్యూలర్ మరియు మ్యాక్రోవాస్క్యూలర్ సమస్యలను కలిగి ఉండటం వలన ప్రాణాంతకమవుతుంది, డయాబెటిస్ మెల్లిటస్ యొక్క సమస్యలుఈ క్రింది విధంగా ఉన్నాయి:
- కార్డియోవాస్కులర్ వ్యాధులు.
- డయాబెటిక్ నెఫ్రోపతీ (మూత్రపిండానికి హాని).
- డయాబెటిక్ రెటినోపతి (కంటికి హాని).
- డయాబెటిక్ న్యూరోపతి (నరాలకుహాని).
- స్కిన్ ఇన్ఫెక్షన్లు.
- డిప్రెషన్.
- అల్జీమర్స్ వ్యాధి.
డయాబెటిస్ ఇన్సిపిడస్ యొక్క సమస్యలు
డయాబెటిస్ ఇన్సిపిడస్ యొక్క సమస్యలు స్థితి యొక్క తప్పుడు నిర్ధారణ కారణంగా లేదా సరైన చికిత్స చేయలేకపోవడం వలన అభివృద్ధి చెందుతాయి.డయాబెటీస్ ఇన్సిపిడస్అనేది అధిక మూత్రవిసర్జన మరియు దాహం యొక్క అనుభూతిని కలిగి ఉంటుంది కాబట్టి, ఈ దిగువ రెండు ప్రధాన సమస్యలను గమనించవచ్చు:
- డీహైడ్రేషన్
- ఎలక్ట్రోలైట్స్‌అసమతుల్యత
డయాబెటిస్ చికిత్స కొరకు అపాయింట్మెంట్ పొందగలరు
Diabetes telugu treatment appointment
డయాబెటిస్ పై తరచుగా అడుగుతున్న ప్రశ్నలు
Related Articles






Share on
Request an appointment
Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868