బ్రెయిన్ ట్యూమర్ (మెదడు కణితి) - కారణాలు, లక్షణాలు & చికిత్సపై డాక్టర్ యు ఎల్ సందీప్ వర్మ వివరణ
బ్రెయిన్ ట్యూమర్ (Brain Tumor) అనేది మెదడులో కణాలు అదుపు తప్పి పెరిగి గడ్డలా మారే సమస్య. ఇది మెదడులోనే ఏర్పడే ట్యూమర్ (ప్రైమరీ) లేదా శరీరంలో ఇతర భాగాల నుంచి వచ్చే ట్యూమర్ (సెకండరీ) కావచ్చు. సాధారణంగా మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది, అదేవిధంగా చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. మొదట తలనొప్పి (Headache), వాంతులు, చూపు దెబ్బతినడం, మూర్ఛ, బలహీనత కనిపిస్తాయి. తీవ్రమైన దశలో స్పృహ కోల్పోవడం, అవయవాలు పనిచేయకపోవడం కూడా జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్ ప్రధాన కారణాలలో ఎక్కువగా రేడియేషన్ కు గురికావడం, కుటుంబ చరిత్ర లేదా జన్యుపరమైన మార్పులు కూడా ఉండవచ్చు.
ఈ అవగాహన వీడియోలో డాక్టర్ యు ఎల్ సందీప్ వర్మ గారు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, దశలవారీ సమస్యలు, మరియు చికిత్సల గురించి వివరిస్తారు. ట్యూమర్ స్థితికి తగ్గట్టు శస్త్రచికిత్స, కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్, టార్గెట్డ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు గురించి చక్కటి వివరణ అందిస్తారు. ఈ వీడియో ద్వారా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన పూర్తి అవగాహన మరియు దిశనిర్ధేశం పొందవచ్చు.
Related Articles

Share on
Request an appointment
Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868